📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

liquor scam: కల్తీ మద్యం స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలి

Author Icon By Saritha
Updated: October 13, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చంద్రబాబు, లోకేష్‌లను విచారించాలంటూ రోజా వ్యాఖ్యలు

పుత్తూరు (చిత్తూరు జిల్లా) : అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో బయటపడిన కల్తీ మద్యం స్కామ్ను సిబిఐతో విచారణ చేయించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్.కె. రోజా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు, (Chandra Babu Naidu) విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలను విచారించాలన్నారు. ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్రను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఆదివా రం చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆమె మాట్లాడారు. కల్తీ మద్యం (liquor scam) స్కామ్ సిఎం చంద్రబాబుకు, షాడో సిఎంగా వ్యవహ రిస్తున్న లోకేష్కు తెలీకుండా జరగదన్నారు. కల్తీ మద్యం స్కామ్కు పాల్పడింది వైకాపాకు చెందిన వారని ఆరోపిస్తున్న నేపథ్యంలో గత 16 నెలలుగా కల్తీ మద్యం తయారుచేస్తుంటే కూటమి ప్రభుత్వం నిద్రపోతోందా అని ప్రశ్నించారు. స్వయంగా ఎక్సైజ్ శాఖాధికారులే పత్రికా సమావేశంలో కూటమి ప్రభుత్వ హయాంలోనే కల్తీ మద్యం తయారీ ప్రారంభమైందని చెప్పిన విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్రకు తెలీదా అని నిలదీశారు. టిడిపి నుంచి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జయచంద్రారెడ్డిని వైకాపా కోవర్ట్ అని ఆరోపించి సస్పెండ్ చేసి చేతులు దులుపుకో వాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ స్కామ్లో నిందితుడిగా వున్న జనార్ధనరావు వైకాపాకు చెందిన వ్యక్తిగా ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పుడు పనులు చేసి దొరికిపోతే వైకాపా అని చెప్పడం, దొరక్క పోతే టిడిపిలోనే కొనసాగుతున్న వారి నుంచి ముడుపులు తీసుకుంటున్నారని తెలిపారు.

Read also: నాలుగు రాష్ట్రాల్లో మోగిన ఉప ఎన్నిక.. షెడ్యూల్ ఖరారు

సురేంద్రనాయుడు–చంద్రబాబు సంబంధం పై ఆరోపణలు

ఈ స్కామ్కు మూలకారకుడైన సురేంద్రనాయుడుకు చంద్రబాబుకు సంబంధం వుందన్నారు. 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య హత్య కేసులో 2006లో జీవిత కాల శిక్ష పడి జైలులో వున్న సురేంద్రనాయుడుకు అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేశారని తెలిపారు. ప్రస్తుత కల్తీ మద్యం స్కామ్ లో సురేంద్రనాయుడు పాత్ర స్పష్టంగా వున్నట్టు ఆధారాలు వున్నాయని తెలిపారు. చంద్రబాబు నేరస్తులకు ఆశ్రయమిచ్చి వారిని స్కామ్లకు ఇన్ఛార్జ్ పెట్టగా వచ్చే కలెక్షన్ డబ్బు విజయవాడలో కరకట్ట ఇంటికి చేరుతోందా లేదా హైదరాబాద్ కు చేరుతోందో సిబిఐ తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కల్తీ మద్యం (liquor scam) స్కామ్పై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేస్తే ఒరిగేదేమీ వుండదన్నారు. గతంలో నారాయణ కాలేజీల్లో జరిగిన మరణాలు, గోదావరి పుష్క రాలు, ఇటీవల తిరుపతి తొక్కిసలాట ప్రమాదలపై వేసిన కమిటీలు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్నే నివేదికగా ఇచ్చాయని తెలిపారు. కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన గత ఏడాదిలో గంజాయి, అక్రమ మద్యం కేసులు 21 శాతం వరకూ పెరిగాయని ప్రభుత్వ లెక్కలే చెబుతు న్నాయన్నారు. మహిళలపై అత్యాచారాలు, గృహ హింస వంటి నేరాలు 10 శాతం పెరిగాయన్నారు. కల్తీ మద్యం వల్ల ఎంతో మంది మహిళల తాళిబొట్లు తెగిపోయాయని, ఇది చిన్నపాటి నేరం కాదని, అందువల్ల దీనిపై సిబిఐ తో విచారణ చేయించి దోషులు ఎంత పెద్దవారైనా వారిని శిక్షించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడిని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh politics AP News Chandrababu Naidu latest news Nara Lokesh R.K. Roja Surendra Naidu TDP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.