📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Liquor Scam : జగన్ కనుసన్నల్లోనే లిక్కర్ కొనుగోళ్లు!

Author Icon By Shravan
Updated: August 13, 2025 • 8:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎసిబి కోర్టుకు సమర్పించిన అనుబంధ ఛార్జిషీటు-2లో వెల్లడించిన సిట్

విజయవాడ (Liquor Scam) : ఎపి లిక్కర్ స్కామ్ లో మాజీ సిఎం జగన్ (Former CM Jagan) పాత్ర ఉందని స్పష్టం చేసింది. ఈ కథంతా ఆయన ఆదేశాలతో, ఆయన అనుమతి జరిగిందని వాదిస్తుంది. సోమవారం సిట్ అనుబంధ చార్జీషీట్-2ను విజయవాడ ఎసిబి కోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో జగన్ కనుసన్నల్లోనే లిక్కరు కొనుగోళ్లు జరిగినట్లు ప్రస్తావించింది. ఆధారాలను నిందితులు పక్కా ప్రణాళికతో ధ్వంసం చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో మాజీ సిఎం జగన్ కు ఉచ్చుబిగుస్తుంది. అప్పటి ఇంటెలిజెన్స్ డిజి పిఎస్ఆర్ ఆంజనే యులుకు ఇందులో పాత్ర ఉన్నట్లు అనుబంధ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఫోన్ నంబర్ల ఫోరెన్సిక్ విశ్లేషణలోనూ నిందితులమధ్య జరిగిన సంభాషణలు, సంక్షిప్త సందేశాలు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమావేశమైందనేది సైతం బహిర్గతమైంది. ఎవరికి ఎంతెంత మద్యం ఆర్డర్లు ఇచ్చారనే వివరాలు తెలియజేసే ఓఎస్ దస్త్రాలు, అనుబంధ పత్రాలు మార్చేయడం, అందులోని వివరాలను ధ్వంసం చేయడంపై చర్చించేందుకు 2023 నవంబరు 2న వడ్డేశ్వరంలో కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, సత్యప్రసాద్, అప్పటి ఇంటెలిజెన్స్ డిజి పిఎస్ఆర్ ఆంజన యులు, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, నాటి సిఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్ కృష్ణమోహన్రెడ్డి కలుసుకున్నారని సిట్ తన నివే దికలో పేర్కొంది.

గోవిందప్ప బాలాజీ ఫోన్ నంబరుతోనూ లొకేషన్ పరిశీ లించగా 2023 సెప్టెంబరు 14 న జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో వైఎస్సార్సీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, అవినాష్, వెంకటేశ్నాయుడుతో గోవిందప్ప బాలాజీ ఉన్నారు. ఏ1గా ఉన్న రాజ్ కెసిరెడ్డి పిఎ మల్లేశ్ ఫోన్ ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపగా ఎస్ఓఎం డిస్టిలరీస్, బ్రూవరీస్ అధ్యక్షుడు దివాకరన్ తో జరిపిన సంభాషణలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి ప్రభావవంతమైన వ్యక్తిగా తేలింది. బూనేటి చాణక్య, విజయసాయిరెడ్డి బెదిరింపుల కారణంగా ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని ఓం సన్స్ లిమిటెడ్ డిస్టిలరీలో పనిచేసే జయరాం ఫోన్ సంభాషణతో బయటపడింది. ఓం సన్స్ ఉన్నత కార్యనిర్వాహకులతో జయరాం చేసిన వాట్సప్ చాట్లను పునరుద్ధరించగా నిందితుల ఒత్తిడి కారణంగా వారికి భారీ మొత్తంలో నగదు ఎలా అందజేశారో తేలింది. రాజ్ కెసిరెడ్డి, అతని సహచరుల నుంచి ముడుపుల స్వీకరణ, ఆర్థిక అవకతవకలు, ముడుపులు దాచడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా అధికారిక మద్యం సరఫరా ఆర్డర్లను తారుమారు చేసేందుకు, నాశనం చేయడానికి వ్యూహాలపై చర్చించడానికి తాడేపల్లిలో 2024 జనవరిలో సమావేశాలు నిర్వహించారు.


ఈ సమావేశాలకు ధనుంజయరెడ్డి హాజరైనట్లు సెల్దవర్ డేటా, సాక్షుల వాంగ్మూలాల ద్వారా నిర్ధరించారు. ప్రభుత్వ రికార్డులను (Government records) తారుమారు చేసేందుకు ప్రణాళికరూపకల్పన, అమలులో ఆయన ప్రమేయంఉంది. వైఎస్సార్సీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మద్యం ముడుపులు పొందిన వారిలో ఉన్నారని తేలింది. వైఎస్సార్సీ తరఫున ఎన్నికల్లో డబ్బులను పంచేందుకు రాజ్ కెసిరెడ్డి నుంచి లంచాలు స్వీకరించారని సిట్ తన నివేదికలో తెలిపింది. మద్యం వ్యాపారం విషయంలో సత్యప్రసాద్ రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి సంబంధం కలిగి ఉన్నట్లు ఫోన్ల కాల్దేటా, సంక్షిప్త సందేశాలు రుజువు చేశాయి. మరో సందేశంలో ధనుంజయరెడ్డికి వాసుదేవరెడ్డి, వెంకట సత్యప్రసాద్కి మధ్య జరిగిన సంభాషణ ప్రధానంగా వెలుగుచూసింది. ఫోన్ నంబరు ఆధారంగా ధనుంజయరెడ్డి లొకేషన్లను పరిశీలించగా 2023 జులై 1న సైమన్ ప్రసన్న, పురుషోత్తం వరుణ్కుమార్, పైలా దిలీప్ తో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 56లో సమావేశమైనట్లు తేలింది.

అదే రోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 72 లో వైఎస్సార్సీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, పురుషోత్తం వరుణ కుమార్, ముప్పిడి అవినాష్రెడ్డి, బూనేటి చాణక్యలను ఆయన కలిసినట్లు తేలింది. పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి 2023 ఆగస్టు 6న హైదరాబాద్లోని మెహదీపట్నం, ఆసిఫ్ నగర్ ప్రాంతంలో వెంకటేశ్ నాయుడుతో కలిసి ఉన్నట్లు స్పష్టమైంది. సరిగ్గా అదేరోజు హైదరాబాద్లోని రేతిబౌలిలో బూనేటి చాణక్యతో ఉన్నారు. మద్యం వ్యాపారం విషయంలో సత్యప్రసాద్ రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి సంబంధం కలిగి ఉన్నట్లు ఫోన్ల కాలేటా, సంక్షిప్త సందేశాలు రుజువు చేశాయి.

మరో సందేశంలో ధనుంజయరెడ్డికి వాసుదేవరెడ్డి, వెంకట సత్యప్రసాద్కి మధ్య జరిగిన సంభాషణ ప్రధానంగా వెలుగుచూసింది. ఫోన్ నంబరు ఆధారంగా ధనుంజయరెడ్డి లొకేషన్లను పరిశీలించగా 2023 జులై 1న సైమన్ ప్రసన్న, పురుషోత్తం వరుణ్ కుమార్, పైలా దిలీప్ తో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 56లో సమావేశమైనట్లు తేలింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 72లో వైఎస్సార్సీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, పురుషోత్తం వరుణ్ కుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డి, బూనేటి చాణక్యలను ఆయన కలిసినట్లు తేలింది. పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి 2023 ఆగస్టు 6న హైదరాబాద్లోని మెహదీపట్నం, ఆసిఫ్ నగర్ ప్రాంతంలో వెంకటేశ్ నాయుడుతో కలిసి ఉన్నట్లు స్పష్టమైంది. సరిగ్గా అదేరోజు హైదరాబాద్లోని రేతిబౌలిలో బూనేటి చాణక్యతో ఉన్నారు. ఈ వ్యవహారంలో జగన్ కీలకంగా వ్యవహారించారని పేర్కొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/do-you-use-petrol/national

Andhra Pradesh News AP Politics Breaking News in Telugu Jagan Mohan Reddy Latest News in Telugu Liquor Deals liquor scam Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.