📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

liquor Policy : కొత్త మద్యం పాలసీ ఆరంభం సెప్టెంబరు 1 నుంచి అమలు

Author Icon By Shravan
Updated: August 19, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

liquor Policy : మూడేళ్ల కాలపరిమితో రాష్ట్రంలో నూతన బార్ పాలసీని (New bar policy) అమలు చేయనున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు.. సోమవారం ఐహెచ్సీ భవన్లో గల ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తో కలిసి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ 275 ద్వారా ఈ నెల 13 న నూతన మద్యం పాలసీ విడుదల చేసిందన్నారు. సెప్టెంబర్ 1, 2025 నుంచి మద్యం పాలసీపై రాష్ట్రంలో కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నారు. 1 సెప్టెంబర్, 2025 నుంచి 31 ఆగస్టు, 2028 వరకు ఈ విధానం వచ్చే మూడేళ్ల పాటు రాష్ట్రంలో అమలులో ఉంటుందన్నారు. గతంలో వేలం వేయడం ద్వారా బార్లను కేటాయించగా, ఇప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తున్నామన్నారు.

దీనికోసం 840 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు

ఈ కొత్త విధానంలో ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంటాయన్నారు. ప్రస్తుత పాలసీ ప్రకారం రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లు తెరిచి ఉండేవన్నారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ. 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున బార్ల లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఏడాది 10 శాతం లైసెన్స్ ఫీజు అన్ని కేటగిరీలకు పెరుగుతుందన్నారు. గీత కార్మికుల కులాల కోసం 10 శాతం బార్లను రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ చేసిందన్నారు. వీటికి సాధారణ బార్ ల లైసెన్సు రుసు ముల్లో 50 శాతం తక్కువగా రుసుముగా ఉండనుందన్నారు. అన్ని బార్లను లాటరీ పద్దతిన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో తీయడం జరుగుతుందన్నారు.

గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాల్సి ఉండేదన్నారు. ఈ సారి ఈ నిబంధనను సడలించడం జరిగిందన్నారు. 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్నిప్రభుత్వం కల్పించింది కాని కొన్ని సందర్భాల్లో ఇంకో 15 రోజుల్లోగా రెస్టారెంట్ ఏర్పా టు చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రతి ఏడాది 10 శాతం ఫీజు పెంచుతామన్నారు. గతంలో ఒకేసారి ఆగస్ట్ లోపు లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉండేదన్నారు. ఈసారి 6 సార్లుగా చెల్లింపులు చేయవచ్చన్నారు.

ఎంతో పారదర్శకంగా బార్ పాలసీ

ఇవాల్టి నుంచి ఈ నెల 26 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 28 న లాటరీ తీసి బార్లు కేటాయిస్తామన్నారు. ధరఖాస్తుదారులు అప్లికేషన్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్, హై బ్రిడ్ మోడ్ లోనూ ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబా టులోకి వస్తుందన్నారు. ఎంతో పారదర్శకంగా బార్ పాలసీ తీసుకురావడం జరుగుతుందన్నారు. కొత్త వారు ఈ బిజినెస్ లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామన్నారు. గతంలో బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవన్నారు. ఈసారి ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు బార్లకు అనుమతి (Bars allowed) ఉంటుందన్నారు. అన్ని కేటగిరీలో అప్లికేషన్ ఫీజు 5 లక్షలు గా నిర్ణయించామన్నారు. గతంలో కేటగిరీల బట్టి 7.5 లక్షలు, 10 లక్షల వరకు బార్ల అప్లికేషన్ ఫీజు ఉండేదన్నారు. కొన్ని చోట్ల మద్యం సిండికేట్లు కొత్త వారిని రాకుండా చేసే అవకాశం ఉందని, వాటి ని ఆపేందుకు కొత్త నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో కంటే లైసెన్స్ ఫీజు 70 నుంచి 50 శాతానికి తగ్గాయన్నారు. ఎయిర్ పోర్ట్స్ బార్ల లైసెన్స్కు ప్రభుత్వంనుంచి త్వరలో గైడ్లైన్స్ రావాల్సి ఉందన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/steel-plant-will-not-forgive-chandrababu-if-visakha-steel-is-privatized/andhra-pradesh/532336/

Andhra Pradesh Liquor Policy Breaking News in Telugu Liquor Policy 2025 Liquor Shops License New Liquor Policy Implementation New Liquor Rules Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.