हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: CM Chandrababu: గాంధీ కొండకు లిఫ్ట్..అక్టోబర్ 2న ప్రారంభించనున్న సీఎం

Anusha
Latest News: CM Chandrababu: గాంధీ కొండకు లిఫ్ట్..అక్టోబర్ 2న ప్రారంభించనున్న సీఎం

విజయవాడ నగరం ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా గొప్ప ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. ఇక్కడ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి కొండ, గుణదల కొండ, గాంధీ కొండలు విశేష ఖ్యాతి పొందాయి. వీటిలో గాంధీ కొండ (Gandhi hill) ప్రత్యేకతతో నిలుస్తోంది. మహాత్మాగాంధీ స్మారకార్థంగా నిర్మించబడిన ఈ కొండ, దశాబ్దాలుగా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.

Weather Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థంగా దేశవ్యాప్తంగా అనేక స్మారక చిహ్నాలు నిర్మించబడ్డాయి. ఆ క్రమంలో విజయవాడ (Vijayawada) లోని రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారం సమీపంలో ఉన్న ఈ కొండపై స్మారక స్థూపాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

1964 నవంబర్ 9న దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, 1968 అక్టోబర్ 6న గాంధీజీ శతజయంతి వేడుకల సందర్భంగా నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ చేతుల మీదుగా 52 అడుగుల ఎత్తైన ఈ స్మారక స్థూపం ప్రజలకు అంకితం చేయబడింది. అప్పటి నుంచి గాంధీ కొండ విజయవాడ నగరానికి ఒక గుర్తింపుగా మారింది.

పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన గాంధీకొండ

విజయవాడలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన గాంధీకొండపైకి భారీ లిఫ్ట్ సిద్ధమవుతోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి (Gandhi Jayanti on October 2nd) సందర్భంగా సీఎం చంద్రబాబు దీనిని ప్రారంభిస్తారు. కొండపై ఉన్న స్మారక స్థూపం వద్దకు సందర్శకులు సులభంగా చేరుకోవడానికి ఈ లిఫ్ట్ ఉపయోగపడుతుంది.

CM Chandrababu
CM Chandrababu

ప్రస్తుతం ఇక్కడకు చేరుకోవడానికి కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉంది. సీఎం పర్యటన తర్వాత ఈ లిఫ్ట్ శాశ్వతంగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ లిఫ్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.సీఎం చంద్రబాబు విజయవాడ పర్యటనలో భాగంగా.. అక్టోబరు 2న గాంధీకొండకు రాబోతున్నారు.

గాంధీ ఇండియా ఇంటర్నేషనల్‌ ప్రాజెక్టులను

అదే రోజు చంద్రబాబు (CM Chandrababu) జంబో లిఫ్ట్‌ను ప్రారంభిస్తారు. దీంతో పాటుగా గాంధీహిల్‌ రీ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు, గాంధీ ఇండియా ఇంటర్నేషనల్‌ ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

చంద్రబాబు తొలిసారిగా గాంధీ స్మారక స్తూపం నుండి విజయవాడ అందాలను వీక్షించనున్నారు.గాంధీ కొండపైకి ఘాట్‌ రోడ్డు ఉంది. కానీ అది కొండ పైవరకు లేదు. కొండ శిఖరాగ్రంలో ఉన్న గాంధీ స్మారక స్థూపం (Gandhi Memorial Stupa) వరకు వెళ్ళాలంటే మెట్లమార్గం ఒక్కటే దిక్కు. అందుకే నిర్వాహకులు లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

గాంధీహిల్‌ సొసైటీ సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. కొండ మిడిల్‌ డౌన్‌ నుండి స్మారక స్తూపం వరకు జంబో లిఫ్ట్‌ను నిర్మిస్తున్నారు. లిఫ్ట్‌ పైభాగం నుండి 25 మీటర్ల దూరంలోని గాంధీ స్మారక స్థూపం వరకు ఎలివేటెడ్‌ పాత్‌వేను కూడా నిర్మించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870