📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Library Development Plans: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

Author Icon By Radha
Updated: October 11, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : అమరావతిలో అధ్బుతమైన అత్యాధునిక వసతులతో సెంట్రల్ లైబ్రరీ(Library Development Plans) నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు.

Read also: Today Gold Rate 11/10/25 : 11 అక్టోబర్ 25 బంగారం ధరలు భారీగా పెరిగాయి

అమరావతిలో సెంట్రల్ లైబర్రీ నిర్మాణానికి సంబంధించి అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన కార్యశాలను రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండేలా ఐదు ఎకరాల స్థలంలో ఈ లైబ్రరీ నిర్మాణం ఉంటుందన్నారు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా వేలాది మందికి హైద్రాబాద్లో ఉద్యోగాలు పొందారన్నారు.

2025లో నిర్మాణం చేయబోయే ఈ లైబ్రరీ(Library Development Plans) కూడా భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా ఉంటుందన్నారు. ఇతర దేశాల్లో కూడా పలు లైబ్రరీలను సందర్శించి వచ్చానన్నారు. ७ వివరాలతో పాటు, నిపుణుల అభిప్రాయాలను తీసుకుని అందరికీ నచ్చేలా మెచ్చేలా గ్రంధాలయం ఉంటుందన్నారు.


దేశంలోనే అత్యాధునిక సెంట్రల్ లైబ్రరీని అమరావతిలో(Amaravati) నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నమూనా ఎలా ఉండాలి, ఏ విధంగా రూపకల్పన చేయాలనే అంశాలపై వర్క్ షాపు నిర్వహించామన్నారు. అనేక ప్రాంతాల నుంచి నిపుణులైన ఆర్కిటెక్చరర్లు వచ్చారన్నారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సాప్ట్ వేర్ లకు సంబంధించిన అంశాలను నిపుణులు వివరించారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తీసుకోవాల్సిన అంశాలపై నైపుణ్యం కల్గిన వారి నుంచి, వివిధ యూనివర్శిటీ ప్రొఫెసర్ల నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. న్నామన్నారు. వచ్చే రెండేళ్ళల్లో ఈ సెంట్రల్ లైబ్రరీ దేశానికే ఆదర్శంగా ఉండబోతుందన్నారు. ఈ గ్రంధాలయం నిర్మాణం కోసం త్వరలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ కాంపిటేషన్స్ నిర్వహిస్తామన్నారు.

ప్రముఖ ఆర్కిటెక్చర్లు కూడా ఈ పోటీలో పాల్గొని వివిధ నిర్మాణ ఆకృతులను కూడా అందించ వచ్చునన్నారు. అనంతరం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, అద్భుతమైన డిజైన్తో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం రెండేళ్లలో పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మోలిక వసతులు కల్పన బోర్డు చైర్మన్ రాజశేఖర్, గ్రంథాలయ సంస్థ బోర్డు డైరెక్టర్ డైరెక్టర్ రాసాని పద్మజ, రామూర్తి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కృష్ణ మోహన్, తదితరలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Libraries Cultural Development Knowledge Centers library development Public Libraries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.