📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Lepakshi handicraft – శిల్పకారుల ప్రతిభకు పురస్కారం

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లేపాక్షి హస్తకళల డిజైన్ అవార్డులు

విజయవాడ :హస్త కళా కారుల జీవన ప్రమాణ స్థాయు పేరిగినప్పుడే ఆ కళలు భవిష్యత్తు తరాలకు అందుబాటులోకి వస్తాయని లేపాక్షి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ (Lepakshi Chairman Dr. Pasupuleti Hari Prasad) అన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ డిజైన్ పోటీ 2025 అవార్డుల (Lepakshi Handicraft Design Competition 2025 Awards) కార్యక్రమం శుక్రవారం సాయంత్రం విజయవాడ అమ్మ కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. శిల్పకళల్లో వినూత్నత ప్రదర్శించిన కళాకారులను ఈ సందర్భంగా సత్కరించారు. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతి ఒక్క ఉత్పత్తికి జీ ఐ సాధించేలా కృషి ఈ సందర్భంగా హరి ప్రసాద్ అన్నారు.

అవార్డులు శిల్పకారుల ప్రతిభ

కార్యక్రమానికి చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా అధ్యక్షత వహించగా అవార్డులు శిల్పకారుల ప్రతిభను మాత్రమే కాదు, రాష్ట్ర సంప్రదాయ కళలకు ప్రోత్సాహాన్ని కూడా ప్రతిబింబించాయన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ (Vishwa Manoharan) సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అవార్డులు శిల్పకారుల ప్రతిభను మాత్రమే కాదు, రాష్ట్ర సంప్రదాయ కళలకు ప్రోత్సాహాన్ని కూడా ప్రతిబింబించాయి. కొండపల్లి, ఎటికొప్పాక, వుడ్ కార్వింగ్, తోలుబొమ్మలు, కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ విభాగాల్లో పోటీ నిర్వహించి నిపుణులతో కూడిన జ్యూరీ ద్వారా నూతన ఆవిష్కరణలను ఎంపిక చేశారు.

Lepakshi handicraft

మొత్తం 15 అవార్డులకు గాను

మొత్తం 15 అవార్డులకు గాను గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు కలిపి రూ.3 లక్షలు పంపిణీ చేశారు. నూతక్కి శ్రీనివాసరావు (కొండపల్లి బొమ్మలు శ్రీనివాస కల్యాణం), టాంగేటి అయ్యన్న (ఎటికొప్పాక బొమ్మలు – మల్టీపర్పస్ యుటిలిటీ బాక్స్), దలవాయి ఆనంతమ్మ (తోలుబొమ్మలు టేబుల్ ల్యాంప్ షేడ్),

సుబ్రహ్మణ్య ఆచార్య (వుడ్ కార్వింగ్ షోకేస్ ఐటమ్), కె.వి.ఎస్.ఎన్. కిషోర్(కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ వాల్ పెయింటింగ్ క్లాత్) లు బంగారు పతకాలు గెలుచుకున్నారు. అదనంగా ఐదుగురు శిల్పకారులు (Artisans) ప్రత్యేక అవార్డులు అందుకున్నారు. వీరిలో ఒక్కొక్కరికి రూ. 10,000, సర్టిఫికెట్లు బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా గాంధీ శిల్ప్ బజార్, మాస్టర్పీసెస్ ప్రదర్శన అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 14 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-narayana-drinking-water-for-all-households-in-the-next-three-years/andhra-pradesh/546353/

Andhra Pradesh handicrafts artisans livelihood Breaking News handicraft development latest news Lepakshi Chairman Dr Pasupuleti Hari Prasad Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.