తిరుమల: నిత్యం యాత్రికుల వాహనాల రాకపోకలతో, భక్తులతో సందడిసందడిగా ఉండే తిరుపతి (Tirupati) అలిపిరి (Alipiri) తనిఖీ కేంద్రానికి సమీపంలో చిరుతపులి జింకను చంపి తిన్న ఘటన శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. తనిఖీ కేంద్రం సిబ్బంది అటుగా అటవీప్రాంతంమార్గంలో వెళ్ళడంతో దీన్ని గమనించి భయంతో పరుగులుతీశారు.
జింకను చంపిన చిరుత
మొన్నటివరకు తిరుమలలో , కాలినడక మార్గాల్లో, ఘాట్రోడ్డు (Ghat Road) లో సంచరించిన చిరుతపులి ఏకంగా తనిఖీ కేంద్రానికి పక్కనే జింకను చంపితిన్నట్లు కళేబరం గుర్తించడం భయం గొల్పుతోంది. తనిఖీ కేంద్రం వద్ద అన్ని వాహనాలు ఆపి తనిఖీ చేస్తారు. భక్తులు కూడా తనిఖీలు చేసుకొంటారు. అలిపిరి (Alipiri) తనిఖీ కేంద్రం సమీపంలోనే చిరుతపులి జింకను చంపి తిని ఆ తరువాత పొట్టభాగం తినేసింది. భద్రత సిబ్బంది గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించారు. వెటర్నరీ కళాశాల ఆస్పత్రికి తరలించారు. జింకకు పోస్టుమార్టమ్ నిర్వహించిన వైద్యులు చిరుతపులి, రేసు కుక్క దాడిచేసిందా అనేది తెలియాల్సి ఉంది. జింక పైదాడిచేసి చిరుతపులి చంపి తినేసిన ఘటన మాత్రం అందరినీ తిరుపతివాసులను భయపెడుతోంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Hansraj Gangaram Ahir: వెనుకబడిన తరగతుల అభ్యున్నతే లక్ష్యంగా అధికారులు పని చేయాలి