📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Law and Order : నేరం చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు : మంత్రి పార్థసారధి

Author Icon By Shravan
Updated: July 31, 2025 • 10:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కళ్యాణదుర్గం : నేరం చేసిన వారు ఎంత గొప్ప వారైనా సరే చట్టపరిధిలో చర్యలు తప్పవని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ప్రజా వేదికలో కార్యకర్తలు అధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి మాట్లాడుతూ, మద్యం కుంభకోణములో దోషులు ఎవరో మద్యం అక్రమ నిధులు ఎవరెవరు ఖాతాలకు ఎలా బదిలీ అయ్యాయో అన్ని విషయాలు సిట్ విచారణలో తేలుతుందని, దోషులుగా తేలిన వారెవరైనా, ఎంత గొప్ప వారైనా వదిలేది లేదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని పేర్కొన్నారు.

జగన్ జైలుకు వెళతాడా..? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ కక్ష సాధింపు పాలన ఉండదని, రాజకీయంగా ఎవరిని వేదించమని, అయితే నేరం చేసిన వారు తప్పకుండా శిక్షార్హులు అవుతారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) రాయలసీమకు చెందిన నాయకుడైనా, రాయలసీమ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువ తకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉక్కు కర్మాగారాన్ని ఐదేళ్లలో ప్రారంభించలేకపోయారన్నారు. గండికోట రిజర్వా యర్ పనులను కూడా పట్టించుకోలేదన్నారు. రాయలసీమలో సోలార్ ప్లాంట్లు, గాలిమరలు ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు వేయలేక పోయారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టి మిగులు జలాలను రాయలసీమ ప్రయోజనానికి ఉపయోగించుకునే రీతిలో కృషి చేస్తున్నారన్నారు. సాగునీరు పరిశ్రమలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

హంద్రీనీవాకు 3,500 కోట్ల రూపాయలు కేటాయించి రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా మరో 3800 కోట్లు వెచ్చించి కాలువ వెడల్పుతో పాటు, లైనింగ్ పనులు చేపట్టి కుప్పం ప్రాంతానికి కూడా సాగునీరు అందించేందుకు కృషి జరుగు తుందన్నారు. అంతే కాకుండా 2018 లోనే జీడిపల్లి రిజర్వాయర్ నుండి కళ్యాణదుర్గంరాయదుర్గం ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించే బిటిపి కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా బీటీపీకి రెండు టీఎంసీలు, కళ్యాణదుర్గానికి 114 చెరువుల ద్వారా సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయన్నారు.-(Law and Order)

Read Hindi News : hindi.vaartha.com

Read also :  Tirumala : శ్రీవాణి టికెట్ల జారీలో మార్పులు!

AP News Breaking News in Telugu Crime Action Latest News in Telugu Law and order Legal Warning Minister Parthasarathi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.