విజయవాడ : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పై బల ప్రదర్శన కోసమే అన్నట్లు ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యా నించారు. ఆయన ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతల పరిస్థితికి భంగం కలిగిస్తున్నారన్నారు. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలన్నారు. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుప్సాకరంగా ఉందని ఆమె అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తూ న్నారా? అని హోంమంత్రి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, సిట్ దర్యాప్తు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాటా డారు. ప్రస్తుతం వైఎస్ జగన్ జైల్ యాత్రలు జరుగుతున్నాయి. రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగు బాధ్యతా ప్రవర్తిస్తున్నారు. పొగాకు రైతుల పరామర్శ పేరుతో తొక్కిపారేయ్యడం జరుగుతున్నాయి.
జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలి. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుస్పాకరంగా ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాము. ప్రసన్నకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చెల్లి అవుతారు. అయినా చెల్లి వరస అయ్యే మహిళపై నీచాతి నీచంగా మాట్లాడారు. అంటే సమర్ధి స్తూన్నారా? అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. వైఎస్ జగన్ మానసిక పరిస్థితి దారుణంగా ఉంది. ఎలా ఉందంటే.. తల్లి, చెల్లిపై మాట్లాడినా కూడా నోరు మెదపని పరిస్థితి ఆయనది. మేం ప్రజాసేవ కోసం కుటుంబ సభ్యులను వదిలి వస్తున్నాం. ఎన్సీఎల్డీలో తల్లిపై గెలిస్తే విజయమా?. మాట్లాడితే జగన్ పోలీసులపై పడుతున్నారు. ఈ మధ్య జగన్ తన, పర్యటన సమాచారం పోలీస్ శాఖకు కూడా జగన్ చెప్పాలి.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Investments : రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు – మంత్రి లోకేష్