రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయింది: జగన్‌

Read Time:  1 min
అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్
అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్
FONT SIZE
GET APP

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శలు

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. వంశీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయిందని విమర్శించారు. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం

గన్నవరం కేసులో తనపై టీడీపీ వాళ్లు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ ఓ దళిత యువకుడు సాక్షాత్తు జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేశాడు. దాంతో తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటికి వస్తున్నాయని తట్టుకోలేక, దాన్ని కూడా మార్చేసేందుకు చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది.

వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి బెదిరించడం కరెక్టేనా? ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టిలో ఉంది. సుప్రీం ఆదేశాలతో దిగువ కోర్టు ఈ కేసును విచారిస్తోంది. అలాంటప్పుడు పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటికి వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరికి జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తుండడం అధికార దుర్వినియోగం కాదా?” అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు గారూ… ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తున్నారు… మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు… మీరు తగిన మూల్యం చెల్లించక తప్పదు అంటూ జగన్ ట్వీట్ చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.