విజయవాడ : నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించి, వారికి ఉజ్వల భవిష్యత్తు చూపించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయీమెంట్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ), డీడీయూ జీకేవై (దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన) ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ (Free training for the unemployed) ఇస్తున్నారు.ఇంటర్, డిగ్రీ, బీటెక్ లో ఎన్ని మార్కులొచ్చినా ఉద్యోగం రావాలంటే ప్రతి విద్యార్థికి కనీస నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రైవేటు సంస్థల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నా ఫీజు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి.
అవసరమైన నైపుణ్యాలను
ఏపీలో రాష్ట్ర ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకాభివృద్ధి (సీడాప్) విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. ప్రొడక్షన్ ఇంజినీర్ మల్టీ స్కిల్ టెక్నీషియన్ వేర్హౌస్ సూపర్వైజర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (నాన్ వాయిస్) రెస్టారెంట్ కెప్టెన్ ఇండస్ట్రియల్ ఎలక్టీషియన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ అండ్ పెరిఫెరల్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
డొమైన్ కంప్యూటర్ ఇంటర్వ్యూ సాఫ్ట్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లిష్లను నేర్పిస్తారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తనుతీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ఉపాధి కల్పన వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడాప్) (AP Employment Creation Establishment Development Corporation) ఛైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.
ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని
యువతకు ఉపాధిని కల్పించడమే తమ లక్ష్యంగా దాదాపు 24 సెక్టార్స్ లో శిక్షణ కోసం ఐఎస్ బీతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ నినాదం (One Family One Entrepreneur Motto) సాకారం చేసేందుకు ఐఎస్ బీతో కొన్ని కోర్సులకు ఎంవోయూ చేసుకున్నామని అన్నారు. సెంచూరియన్ యూనివర్శిటీతోనూ గతంలో ఒప్పందం చేసుకున్నామనీ, శిక్షణలో 40 శాతం ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని అన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ లో రానున్న మూడు సంవత్సరాల్లో దాదాపు 22,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సీడాప్ ఒక నోడల్ ఏజెన్సీగా ఉండేలా సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో పని చేస్తుందని ఈ సందర్భంగా చైర్మన్ దీపన్రెడ్డి వివరించారు.శిక్షణ పొందే యువతీ, యువకులకు ప్రత్యేక వసతి సదుపాయం ఉంది. రెండు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, తదితరాలు అందిస్తారు. వివిధ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: