Latest News: Prashant విశాఖలో పవన్‌ ను కలిసిన ఆసియా కప్ టీమిండియా మేనేజర్ ప్రశాంత్

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు భారత జట్టు మేనేజర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీవీఆర్ ప్రశాంత్ (PVR Prashanth) నియామకం కావడం తెలుగు రాష్ట్రాల్లో గర్వకారణంగా మారింది. ఈ నియామకంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్‌ను ప్రశాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఒక తెలుగు యువకుడికి ఇంతటి కీలకమైన బాధ్యత దక్కడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ప్రశాంత్ తన ప్రతిభ, కృషితో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) లోని దుబాయ్, అబుదాబి వేదికలుగా ఆసియా కప్ పోటీలు జరగనున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్ జట్టు మేనేజర్‌గా ప్రశాంత్ బాధ్యతలు చేపట్టడం విశేషం.

Latest News
Latest News

రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా నిలిచింది

రాత్రి, పగలు మారిన షెడ్యూల్స్‌ (Schedules) లో ఆటగాళ్లకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, జట్టు అంతర్గత వ్యవహారాలను సమన్వయం చేయడం, అధికారులతో కమ్యూనికేషన్ నిర్వహించడం వంటి కీలక భాద్యతలు మేనేజర్‌గా ఉంటాయి. ఈ బాధ్యతల్లో తెలుగు యువకుడైన ప్రశాంత్ నియమితులవ్వడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.గతంలో ప్రశాంత్ క్రీడా రంగంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున క్రికెటర్‌గా ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇప్పుడు జాతీయ జట్టుకు మేనేజర్‌గా ఎంపికవడం ద్వారా ఆయన తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నారు. 

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-pedda-reddy-on-tadipatri-tour-jc-prabhakar-reddys-sensational-comments/andhra-pradesh/538531/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.