📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Minister Nara Lokesh 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేస్తాం

Author Icon By Anusha
Updated: August 30, 2025 • 7:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులకు శుభవార్త అందింది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 3 శాతం స్పోర్ట్స్ కోటా (sports quota) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని అనేక మంది ప్రతిభావంతులైన యువతకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన “బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్” కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్, భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు, క్రీడాకారుల భవిష్యత్తు బలోపేతం చేసేందుకు 3 శాతం కోటా అమలు చేస్తాం” అని ప్రకటించారు.ఈ సందర్భంగా నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సాహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ట్రాక్ రికార్డ్ ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు

ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పని చేసిన సమయంలో ఆఫ్రో ఏషియన్ క్రీడలను నిర్వహించారని.. అలానే అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ విలేజ్‌ని కూడా నిర్మించారని ఈ సందర్భగా లోకేష్ గుర్తు చేశారు.రానున్న పదేళ్లలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని నారా లోకేష్ తెలిపారు. అలానే ఇటీవల ఏపీలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం (Yogandhra programme) గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మోదీ పిలుపు మేరకు ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని లోకేష్ చెప్పుకొచ్చారు. క్రీడలను ప్రోత్సాహించేందుకు మూలాల నుంచే ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.అలానే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేయడానికి తగిన మౌలిక సదుపాయాలు లేవని.. ప్లే గ్రౌండ్ల కొరతతో పాటుగా.. చాలా పాఠశాలల్లో పీఈటీలు లేరని లోకేష్ అంగీకరించారు. రాత్రికి రాత్రే క్రీడారంగాన్ని మార్చడం కష్టతరమైన పని అన్నారు.

Latest News

ఈ స్థాయికి చేరుకోవడం అంత తేలికైన విషయం కాదన్నారు

అలానే ఇప్పటికి కూడా చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో ప్రోత్సాహించడం లేదని.. ఈ విషయంలో తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం లోకేష్ భారత మహిళా క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వీరు.. ఈ స్థాయికి చేరుకోవడం అంత తేలికైన విషయం కాదన్నారు. చాలా కాలం వరకు మహిళా క్రికెట్ జట్టుకు తగినన్ని సదుపాయాలు ఉండేవి కావని.. మీడియా కవరేజీ కూడా అంతగా ఉండేది కాదని.. మహిళా క్రికెట్ టీమ్‌ను సరిగా పట్టించుకునేవారు కాదని తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని.. వారి టాలెంట్‌తో క్రీడాభిమానులు తలెత్తుకునేలా చేశారని ప్రశంసించారు. గత వరల్డ్ కప్లలో భారత మహిళా జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని లోకేష్ కొనియాడారు.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-rohit-sharma-will-watch-mahesh-babu-and-allu-arjuns-movies/sports/538579/

andhra pradesh sports quota AP minister Nara Lokesh ap sports quota 3 percent Breaking News latest news Nara Lokesh nara lokesh announcement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.