విజయవాడ : దేశంలోనే మాతృ మరణాల రేటు తక్కువగా నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచింది. కేంద్ర జనగణన విభాగం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ద్వారా విడుదల చేసిన 2021 -2023కి సంబంధించిన ప్రత్యేక బులిటెన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో ఎంఎంఆర్ రేటు 30గా నమోదు అయింది. దేశంలోనే అత్యల్పం. గమనించినప్పుడు రాష్ట్రంలో మాతృ మరణాలు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పోషణ్ అభియాన్, ఎనీమియా ముక్త్ భారత్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ జననీ సురక్ష యోజన (Ashwasan Janani Suraksha Yojana) జననీ శిశు సంరక్షణ కార్యక్రమం మాతృ మరణాల సర్వైలెన్స్ రివ్యూ సేఫ్ డెలివరీ క్యాలెండర్ వంటి కార్యక్రమాలను ఏపీలో ఆరోగ్యశాఖ అమలు చేసింది. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో ఆరోగ్య మోలిక సదుపాయాలు బలోపేతం అయ్యాయి.
రేటు మరింత తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు
వైద్యసిబ్బందికి శిక్షణ,గ్రామీణ స్థాయిలో అవగాహన, ఎమర్జెన్సీ రిఫరల్ సర్వీసులు కూడా మరణాల తగ్గుదలకు తోడ్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మాతృ మరణాల రేటులో కేరళతో సమానంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణం. అయితే, ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే రేటు మరింత తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.జాతీయ ఆరోగ్య మిషన్ (National Health Mission) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు ఈ ఫలితానికి కారణమయ్యాయి. గర్భిణులకు నాణ్యమైన, నగదు రహిత ఆరోగ్య సేవలు అందించడం వల్ల మాతాశిశు మరణాల రేటు తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో మాతృ మరణాల రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ప్రతి వెయ్యి జననాలకు ప్రసూతి మరణాల రేటు
2018-205 45, 2019-2155 47, 2021-23లో 30 ఈ తగ్గుదల రాష్ట్ర ఆరోగ్య రంగంలో తీసుకున్న చర్యలకు నిదర్శనం. ప్రసూతి సమయంలో తల్లి మరణించే అవకాశం కూడా రాష్ట్రాలవారీగా లెక్కించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళల్లో 0.05 శాతం మాత్రమేఉంది. తెలంగాణాలో 0.11శాతం, కర్ణాటకలో 0.12 శాతం. ఛత్తీస్ గఢ్ లో 0.37 శాతం. ఒడిశాలో 0.31 శాతంగా మహారాష్ట్రలో 0.06 శాతం గా ఉంది. ప్రతి వెయ్యి జననాలకు ప్రసూతి మరణాల రేటు కూడా రాష్ట్రాల వారీగా విశ్లేషించారు.ఆంధ్రప్రదేశ్ లో ప్రసూతి మరణాల రేటు 2గా నమోదయింది. కేరళలో ఇది 1 మాత్రమే. తెలంగాణలో 3, కర్ణాటకలో 3, తమిళనాడులో 2. ఒడిశాలో 9, ఛత్తీస్ గఢ్ 10, మహారాష్ట్రలో 2గా ఉంది.
Read hindi news:
Read Also: