📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Lokesh Sai – 42 పసిడి పతకాలు సాధించిన కడియాల లోకేష్ సాయి

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూనివర్సిటీలో టాపర్ గా చౌడేపల్లి యువకుడు

చౌడేపల్లి(చిత్తూరు జిల్లా) : రాజ్యాంగం స్ఫూర్తిగా జీవిస్తున్న కుటుంబంలో,విద్యాకుసుమం ఉద్భవించింది… చిన్నతనం నుంచి సమాజ పోకడలపై అవగాహన పుణికిపుచ్చుకున్న అతనిలో అందరి హితం కోసం న్యాయవాద మార్గాన్ని ఎంచుకొన్నాడు…ఊహ తెలిసినప్పటి న్యాయశాస్త్రం రాజ్యాంగం విధివిధానాలపై పట్టు సాధించాడు… తాతయ్య రాజకీయ చతురత తల్లిదండ్రుల సూచనల మేరకు న్యాయశాస్త్రంలో రాణించి 42 పసిడి పతకాలను కొల్లగొట్టి రికార్డు సాధించి చౌడేపల్లికే గర్వకారంణగా నిలచాడు… చిత్తూరు జిల్లా చౌడేపల్లి (Choudepalli, Chittoor district) కి చెందిన కడియాల నగేష్ తిరుపతిలో కోర్టులో స్పెషల్ పిపిగా పనిచేస్తున్నాడు. తండ్రి నగేష్, తల్లి వనజమ్మల ముద్దల తనయుడు కడియాల లోకేష్ సాయి తొలి నుంచి రాజ్యాంగంతోపాటు సమాజంలో జరుగుతున్న పోకడలను తండ్రికడియాల నగేష్ ద్వారా తెలుసుకొంటూ వుండేవాడు.

అందరి హితం కోసం న్యాయవాద మార్గాన్ని ఎంచుకొన్నాడు

ఈక్రమంలో సామాన్యులకు న్యాయం చేయాలన్న తపన అతనిలో కల్గింది. దీంతో న్యాయవాద వృత్తిపై గాలి మల్లింది. తల్లిదండ్రులు సైతం అతని ఇష్టాన్ని కాదనకుండా ప్రోత్సహించారు. ఉన్నత విద్యాభ్యాసం తిరుపతి విద్యానికేతన్లో పూర్తి చేసుకొన్నాడు. అనంతరం న్యాయవాద కోర్సును అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోధరం సంజీవయ్య (Damodharam Sanjeevaiah) జాతీయ విశ్వవిద్యాలయంలో (2018-23)లో చేరి పూర్తి చేసాడు. ఇదే బ్యాచ్లో కడియాల లోకేషాసాయి. అన్ని సబ్జెక్టుల్లోనూ ప్రతిభ చూపి బ్యాచ్ మొత్తానికి టాపర్గా నిలచాడు. మొత్తం మీద 42 బంగారు. పతకాలు సాధించి రికార్డు నెలకొలపాడు. విద్యార్థి నాయకుడా రాణిస్తూనే వాణిజ్య, క్రిమినల్ లాలో జస్టిస్ ఇ. వెంకటేషన్ పతకాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్నాడు. అదే విధంగా ఇండియన్ ఫీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లా విజయ్ శేఖర్ వద్ద అడ్వకేట్ ప్రాక్టీసు చేస్తున్నాడు.

సూచనలతో ఇంతటి విజయానికి మూలకారణం

1978-83 తాత కెవిపతి రాజకీయ దురంధుడుగా పేరుగడించారు. సర్పంచు నుంచి ఎమ్మెల్యే వరకు సేవలందించాడు. చౌడేపల్లి మేజర్ పంచాయతీ సర్పంచుగా, చౌడేపల్లి సమితి ఇన్చార్టీ ఫోర్మన్గా వ్యవహరించాడు. అంతేకాకుండా మద్య కాలంలో పుంగనూరు ఎమ్మెల్యేగా సమాజం కోసం పని చేశాడు. ఆయన కుమారుల్లో ఒకరు కడియాల నగేష్ ప్రస్తుతం తిరుపతిలోనిరెక్సాండిలో కోర్టులో స్పెషల్ పీపీ గా పనిచేస్తున్నాడు. లోకేష్ సాయి: దామోదరం సంజీవయ్య జాతీయవిశ్వవిద్యాలయంలో బిఎఎల్ఎల్బి పూర్తి చేశాను. అన్ని సబ్జెక్టుల్లోనూ రాణించి మొత్తం మీద 42బంగారు పతకాలు సాధించడం ఆనందంగా వుంది. తాత ఆశ్వీదం, అమ్మనాన్నలు కడియాల నగేష్, వనజమ్మల సూచనలతో ఇంతటి విజయానికి మూలకారణం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలన్నది నాకల. ప్రస్తుతం తిరు పతిలోలా ప్రాక్టీస్ అంకిత భావంతో పనిచేస్తున్నా. నాన్న స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలన్నది నా కోరిక అని అన్నారు..

Read hindi news:

Read Also:

https://vaartha.com/latest-news-super-six-police-restrictions-on-the-super-six-meeting-to-be-held-on-the-10th/andhra-pradesh/543802/

Breaking News Chittoor district Choudepalli constitution Gold Medals Kadiyala Lokesh Sai Kadiyala Nagesh latest news Law Studies social awareness Telugu News Vanajamma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.