📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Latest News: Lepakshi handicraft – విజయవాడలో గాంధీ శిల్ప్ బజార్: లేపాక్షి హస్తకళల ప్రదర్శన

Author Icon By Anusha
Updated: September 8, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : భారతీయ హస్తకళల వైభవాన్ని ప్రతిబింబించేలా గాంధీ శిల్స్ బజార్, లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీ ప్రదర్శన విజయవాడలో సెప్టెంబర్ 8 నుండి 14 వరకు అమ్మ కల్యాణ మండపంలో జరగనుంది. ఈ వారాంతపు మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, హస్తకళల అభివృద్ధి కమిషనర్ (Handicrafts Development Commissioner) భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ, లేపాక్షి సంయిక్త సహకారంతో నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు నలభై మంది నిపుణ శిల్పులు, వృత్తిదారులు తమ హస్తకళలతో ఈ ప్రదర్శనలో పాల్గొననున్నారు. కలప చెక్క వస్తువులు, క్రోష్ లేసు, తంజావూరు చిత్రాలు, తోలుబొమ్మలు, రగ్గులు, కృత్రిమ నగలు వంటి సంప్రదాయ కళావస్తువులు ఈ బజార్లో ఆకట్టుకోనున్నాయి.

డిజైన్ పోటీ ప్రదర్శన కూడా జరుగుతుంది

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన కళాకారులు తమ ప్రత్యేక హస్తకళలతో సందర్శకులను అలరించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కళాకారులకు అమ్మకాలు పెరగడంతో పాటు యువతరానికి భారతీయ కళా వారసత్వం పరిచయం కానుంది. ఈ వేడుకలో భాగంగా లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీ ప్రదర్శన (Handicraft Design Competition Exhibition) కూడా జరుగుతుంది. ఇందులో కొండవల్లి బొమ్మలు, ఎటికొప్పాక బొమ్మలు, కలవ చెక్క వస్తువులు, తోలుబొమ్మలు, కలంకారి ముద్రణ వంటి ఐదు విభాగాలలోని సృజనాత్మక కృతులు ప్రదర్శించి బడతాయి, నిపుణుల కమిటీ ద్వారా ఉత్తమ కృతులను ఎంపిక చేసి బంగారు, వెండి, కాంస్య వతకాలు ప్రదానం చేస్తారు. అంతేకాకుండా, మొత్తం రూ. 2.5 లక్షల నగదు బహుమతులు కూడా విజేతలకు అందజేయబడతాయి.

Latest News

ప్రభుత్వ సెలవులు సహా అందరికీ

సందర్శకులు తమకు నచ్చిన కృతులకు ప్రత్యేకంగా ఓటు వేసే అవకాశం ఉండటంతో పోటీ మరింత ఉత్సాహంగా సాగనుంది. ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు సహా అందరికీ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 5గంటలకు ప్రముఖుల సమక్షంలో దీపప్రజ్వలనతో ప్రారంభోత్సవం జరగనుండగా, సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం 5గంటలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించబడుతుంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ మాట్లాడుతూ గాంధీ శిల్ప్ బజార్, లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీలు మన సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించే వేదికలు. ఇవి కళాకారుల ప్రతిభను ప్రజలకు చాటడమే కాకుండా మార్కెట్ అవకాశాలను కల్పిస్తాయి. విజయవాడ ప్రజలు తప్పక ఈ ప్రదర్శనకు హాజరై కళాకారులను ప్రోత్సహించి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంపదను కొనసాగించాలి” అని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-nellore-2776-acres-for-kisan-sez/andhra-pradesh/543119/

Breaking News Gandhi Shilps Bazaar Handicrafts design competition Handicrafts Development Commissioner latest news Lepakshi handicrafts Telugu News Vijayawada handicrafts exhibition

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.