విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయకుడి మందిరం సమీపంలో వైసీపీ నాయకులు ఇటీవల,మాంసాహార భోజనాలు ఏర్పాటు చేయడంపై భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా దమనకాండను ఖండిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రాజ మహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి (Daggupati Purandeshwari) ఎక్స్ లో స్పందించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రామతీర్థం, అంతర్వేదిలలో చోటు చేసు కున్న ఘటనలను ప్రస్తావించారు.
హిందువుల మనోభావాలు
పల్లెల్లోమత మార్పిళ్ళతో హైందవ మత ధ్వంస రచనను ప్రోత్సహించిన దుర్మార్గులు ర్గులు గణేశుడి మండ పాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులు అంటూ వైసిపీ నేతల పనితీరునే ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన నందిగామ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అనకాపల్లి ఎంపీ సిఎం రమేశ్ ఎక్స్లో పేర్కొన్నారు. గణపతి మండపం పరిసరాల్లో మాంసాహార భోజనం వడ్డించి హిందువుల మనోభావాలను వైకాపా దెబ్బతీసింది.
హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలపై వైకాపా చేస్తున్న నిరంతర దాడులకు నిదర్శనం
ఇవన్నీ హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలపై వైకాపా చేస్తున్న నిరంతర దాడులకు నిదర్శనం అని థ్వజమెత్తారు నందిగామలో హిందువుల మనోభావాలను దెబ్బతీసి వైకాపా చర్య దారుణమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Union Minister Bhupathi Raju Srinivasa Varma) ఎక్స్ లో పేర్కొన్నారు. రామతీర్థంలో శ్రీరామ విగ్రహ ధ్వసం అంతర్వేదిలో రథ దహనం, వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు వైకాపా హిందూ వ్యతిరేక ధోరణికి నిదర్శనాలన్నారు.
మనోభావాలన్ని దెబ్బ తీయడమేనని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు
నందిగామ ఘటనకు బాధ్యుతలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వినాయకుడి పందిరి సమీపంలో వైకాపా నాయకులు మాంసాహార భోజనాలు ఏర్పాటు చేయడం హిందువుల మనోభావాలన్ని దెబ్బ తీయడమేనని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. జగన్ హిందూ వ్యతిరేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని, మన సంస్కృతి, సాంప్రదాయాల్ని అవమానించే ఇలాంటి చర్యల్ని సహించబోమని ఎక్స్ లో పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: