📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: EO Shyamala Rao – సంస్కరణల పాలన అందించిన ఇఒ శ్యామలరావు బదిలీ

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 10:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : తిరుమల తిరుపతిదేవస్థానం కార్యనిర్వహణా ధికారి(ఇఒ) జె. శ్యామలరావు (J. Shyamala Rao) బదిలీ అయ్యారు. సీనియర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఏడాది జూన్ 16న రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శి స్థానం నుండి టిటిడి ఇఒగా శ్యామలరావును నియమించారు. గత ఏడాది టిటిడిలో ఉన్న అస్తవ్యస్థ పాలన, గాడితప్పిన అనేక పథకాలను చక్కబెట్టేందుకు శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకనుగుణంగా శ్యామలరావు గత 15నెలల పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ముఖ్యంగా సామాన్యభక్తులు అన్నప్రసాదాలపై తీవ్ర అసంతృప్తి చెందేవారు, అంతేగాక రుచిగా శుచిగా లేవనే ఫిర్యాదులు అందాయి.

నెయ్యిమిశ్రమం

ఏడుకొండల స్వామి లడ్డూ ప్రసాదాల నాణ్యత సరిగా లేదని,నెయ్యివాసన, రుచి లేకపోయిందని, కుంకు మపువ్వు, యాలకులు, నెయ్యిమిశ్రమం కూడా వాడటంలేదని, చక్కెరశాతం ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు భక్తుల నుండి వెల్లువెత్తాయి. అప్ప ట్లోనే గత ఐదేళ్ళ వైసిపి పాలనలో టిటిడి ధర్మ కర్తలమండలి పెద్దలు, అప్పటి అధికారులు కల్తీ నెయ్యి (Adulterated ghee) ని వినియోగించి లడ్డూలు తయా రుచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సమగ్రంగా ఆటు పోటు కార్మికులను ఇటు వైష్ణవబ్రాహ్మణులతో సమన్వయంగా సమావేశం నిర్వహించి పలు అంశాలపై దర్యాప్తు చేపట్టారు. ఏకంగా కల్తీనెయ్యి వాడారనే బాగోతంపై లోతుగా దర్యాప్తుచేయించి ఆధారాలను వెలికితీశారు. ఇంకా టిటిడిలో పలు సంస్కరణలు చేపట్టారు.

వైకుంఠద్వారదర్శనాలకుసంబంధించి

టిటిడిలో అన్యమత ఉద్యోగులకు విఆర్ఎస్. ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ వ్యవహారం, ఉద్యోగులకు నేమ్బ్యడ్జ్లు అమలువంటివి చైర్మన్ నాయుడుతో విబేధించారు. అయితే దురదృష్టవశాత్తు టిటిడి పాలనపై పూర్తిగా పట్టు సాధించలేకపోయిన శ్యామలరావు నేతృత్వంలో ఈ ఏడాది జనవరిలో వైకుంఠద్వారదర్శనాలకుసంబంధించి ఆఫ్లైన్లో తిరుపతిలో టోకెన్లు జారీ ఘటనలో అవగాహన లేక, క్రిందిస్థాయి అధికారుల అత్యుత్సాహంతో ప్రమాదం తప్పిదం జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లోనే ఈ ఘటనపై టిటిడి చైర్మన్ బిఆరా నాయుడుకు, ఇఒ శ్యామలరావుకు మధ్య సమన్వయం లేకపోయింది. అధికారుల తప్పిదం వల్లనే ఈ దారుణం జరిగిందని, తనకు మాటవరుసకైనా ఇఒ విషయాలు చెప్పలేదనేది సిఎం చంద్రబాబు తిరుపతి పర్యటనలో ఆయన ఎదుటే మాట మాట చేసుకున్నారు.

Latest News

ప్రిన్సిపల్ కార్యదర్శిగా

దీన్ని అప్పట్లోనే సిఎం తీవ్రంగా తీసుకున్నా చేసేది ఏమీ లేక శ్యామలరావును కొనసాగించారు. అయితే టిటిడిలో తిరుమలలో ఇఒగా శ్యామలరావు అటు చైర్మన్తో విభేధిస్తున్నాడనేది ప్రధానమైన ఆరోపణ. ఈ నేపధ్యంలో తాజాగా 11మంది ఐఏఎస్ల బదిలీల్లో టిటిడి ఇఒ శ్యామలరావు జిఎడిలొ ప్రభుత్వ పొలిటికల్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించారు. దీంతో దేవదేవుని బ్రహ్మోత్సవాలకు ముందు ఇఒ బదిలీ మాత్రం సంచలనమే.సహజంగా రాష్ట్రప్రభుత్వ పరిపాలనలో ప్రధాన కార్యదర్శి హోదాకంటే ధార్మికసంస్థ తిరుమల తిరుపతిదేవస్థానంలో కార్యనిర్వహణాధికారి(ఇఒ) గా పనిచేసే భాగ్యం జీవితంలో అధికారికి అయినా మరచిపోలేని అనుభూతి.

దేవుని చెంత ప్రతి భక్తుడి

అలాంటిది ఏడుకొండల వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఇది బదిలీ జరగడం మాత్రం ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి. దేవునికి దగ్గరుండి సేవచేసుకునే భాగ్యం కలిగించుకోవడం నిజంగా అదృష్టమే. అలాంటిది సరిగ్గా ఉత్సవాలకు ముందే ఆయన బదిలీ అనివార్యమైంది. గత ఏడాది జూన్ 16న ఇఒగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు తనదైనశైలిలో దేవుని చెంత ప్రతి భక్తుడిలో సంతోషం చూసేలా పనిచేస్తానని, సామాన్య భక్తుడికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలుకల్పి స్తానని, సిఎం విజన్ 2047కు తగ్గట్లు తిరుమ లలో పాలన చేస్తానని చెప్పిన శ్యామలరావు అందుకు అవసరమైన కీలక చర్యలు తీసుకో వడంలో ఆయన సాహసం చేయలేకపోయారనేది ఉద్యోగవర్గాల్లో గుప్పుమంటోంది.

Read hindi news:

Read Also:

https://vaartha.com/latest-news-cm-chandrababu-new-project-worth-rs-553-crore-for-the-development-of-visakhapatnam/andhra-pradesh/543670

Andhra Pradesh Breaking News Chandrababu Naidu J Shyamala Rao latest news Telugu News temple administration tirumala Transfer TTD TTD Reforms

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.