📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Crime గన్నవరంలో ఘోరం..ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య

Author Icon By Anusha
Updated: August 21, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా క్షీణిస్తున్నదనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అక్రమ సంబంధాల వల్ల జరిగే దారుణాలు అత్యంత కలచివేసే అంశాలు. భార్యాభర్తల మధ్య నమ్మకం, ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోతున్న తరుణంలో, పరాయి వ్యక్తుల పట్ల ఆకర్షణ పెరగడం వల్ల ఎన్నో కుటుంబాలు చీలిపోతున్నాయి.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం (Gannavaram Mandal, Krishna District) వెంకట నరసింహపురంలో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇందుకు నిదర్శనం.వివరాల్లోకి వెళ్తే – లక్ష్మణ్, పావని అనే జంట సుమారు 15 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమవివాహం చేసుకున్నా కూడా వీరి జీవితం చక్కగా సాగింది. అద్దెకు ఒక ఇంట్లో నివసిస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించారు.

ఘటన వివరాలు

వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు. మొత్తం మీద ఓ సంతోషకరమైన కుటుంబం అని చుట్టుపక్కల వారు అనుకునేంతగా వీరి జీవితం నడుస్తున్నది.అయితే ఈ సౌఖ్యం ఎక్కువ కాలం నిలవలేదు. వీరి జీవితంలోకి సమీప బంధువు ప్రదీప్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. పావని, ప్రదీప్‌ల మధ్య అనుచితమైన పరిచయం ఏర్పడి క్రమంగా అది అక్రమ సంబంధంగా మారింది. ఈ వ్యవహారం లక్ష్మణ్‌ (Lakshman) కు తెలిసే వరకు, పావని ప్రదీప్‌తో సంబంధాలు కొనసాగించింది. కానీ భర్తకు ఈ విషయం తెలిసిన తర్వాత, ఇంట్లో తగాదాలు మొదలయ్యాయి.ప్రదీప్‌తో సంబంధాలు కొనసాగించడం పట్ల లక్ష్మణ్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశాడు.ఏం జరిగిందో ఏమో.. తెలీదు కానీ ఈనెల 13వ తేదీన నరసింహపురంలో లక్ష్మణ్ విగతజీవిగా పడి ఉన్నాడు. బార్య పావని ఏమి తెలియనట్లు హడావుడిగా చింతకుంట గ్రామంలో అంత్యక్రియలు జరిపించింది.

Latest News

ప్రదీప్ తో కలిసి హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది

అయితే భార్య వ్యవహారపై శైలిపై అనుమానం వచ్చిన భర్త తరపు బంధువులు ఆరా తీశారు.. ఈ క్రమంలోనే.. పావని – ప్రదీప్ మధ్య ఉన్న సంబంధం బయటపడింది.అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తానే ప్రియుడు ప్రదీప్ తో కలిసి హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది. ఈ ఘటనపై లక్ష్మణ్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్‌ – పావనిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశామని.. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-crime-news-where-is-the-son-who-killed-his-mother-for-insurance-money/crime/533743/

andhra pradesh crime Breaking News extramarital affair murder gannavaram incident krishna district news latest news wife kills husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.