📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Latest News: IAS Srilakshmi ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ఆమె చేసిన అపీల్‌ను సుప్రీంకోర్టు విచారించి, హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అంతేకాకుండా, ఈ కేసులో సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మీ పేరు ప్రస్తావనకు రావడం గతంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లిన తర్వాత అనేక రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ జాబితాలో శ్రీలక్ష్మీ (IAS Srilakshmi) పేరును కూడా చేర్చారు. అయితే శ్రీలక్ష్మీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తాను ఏ అక్రమాల్లోనూ పాలుపంచుకోలేదని వాదించారు.శ్రీలక్ష్మీ పేరును తొలగించడం కుదరదని.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై శ్రీలక్ష్మీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ కోటీశ్వర్‌సింగ్‌ ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇస్తూ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

ఆమె దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌ను

ఐఏఎస్ వై శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సీబీఐ కోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరులో ఆమె దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఆమె వెంటనే ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు.. రివిజన్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అనుమతించిన తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిని ఓబుళాపురం కేసు నుంచి తప్పిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే సీబీఐ తెలంగాణ హైకోర్టు (CBI Telangana High Court) తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనల్ని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుని.. ఈ పిటిషన్‌పై వాదనలు వినాలని హైకోర్టుకు తెలిపింది. మూడు నెలల్లో తేల్చాలని సూచించింది.. అయితే ఈ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగించడం కుదరదని తేల్చింది. మళ్లీ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టుకు వెళ్లి తెలంగాణ హైకోర్టు తీర్పుపై తాజాగా స్టే తెచ్చుకున్నారు.

Latest News

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు

మరోవైపు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి సీబీఐ కోర్టు గతంలో వీరికి విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు కొట్టివేసింది. అయితే, దేశం విడిచి వెళ్లకూడదని, రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. దాదాపు 15 ఏళ్లుగా నడుస్తున్న ఓబుళాపురం మైనింగ్ కేసులో విచారణ జరగ్గా.. నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. బి.వి.శ్రీనివాస రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వి.డి. రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్లకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/reservoirs-100-tmc-of-water-reserves-in-somasila-and-kandaleru-reservoirs/andhra-pradesh/537635/

Andhra Pradesh senior IAS Srilakshmi Breaking News IAS officer Srilakshmi relief latest news Obulapuram illegal mining case Supreme Court stay order Telangana High Court order Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.