📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Latest News: భార్యతో గొడవ.. ముగ్గురు బిడ్డల్ని తగులబెట్టి..ఆపై తండ్రి ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గత నెల 30న భార్య దీపికతో గొడవపడ్డ అనంతరం ఆయన ముగ్గురు చిన్నారులను బైక్‌పై తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ నలుగురి ఆచూకీ తెలియకపోవడంతో దీపిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలైన 8 ఏళ్ళ మోక్షిత, 6 ఏళ్ళ వర్షిణి, 4 ఏళ్ళ శివ ధర్మలను బైక్‌పై తీసుకుని గత నెల 30 న ఇంటి నుండి వెళ్ళి పోయాడు. 

అన్వేషణలో భాగంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, మూడు రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) వెల్దండ మండలం పెద్దపూర్ సమీపంలో వెంకటేశ్వర్లు పురుగుమందు తాగి మృతి చెందినట్లు బయటపడింది. అతని మృతదేహాన్ని స్వగ్రామమైన బోయలపల్లికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ముగ్గురు చిన్నారుల ఆచూకీ దొరకకపోవడంతో బంధువులు,తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

పెద్దపూర్‌ పరిసర ప్రాంతాల్లో గాలించగా

అయితే ముగ్గురు పిల్లల ఆచూకీ తెలియ లేదు. చంపేసాడా లేక ఎక్కడైనా వదిలేసాడా అనేది తెలియక బంధువులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  వెంకటేశ్వర్లు మృతదేహం లభించిన తెలంగాణాలోని పెద్దపూర్‌ పరిసర ప్రాంతాల్లో గాలించగా మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. ఆ తరువాత పెద్ద పాప మృతదేహం కూడా అక్కడే లభించింది… 8 ఏళ్ళ పెద్దపాప మోక్షిత, 6 ఏళ్ళ వర్షిణి, 4 ఏళ్ళ శివ ధర్మల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో దొరికాయి.

యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి ఎరువుల వ్యాపారి గుత్తా వెంకటేశ్వర్లు తన భార్యతో గొడవపడి గత నెల 30వ తేదిన ముగ్గురు పిల్లల (Three children) తో బైక్ పై ఇంటి నుంచి బయల్దేరి ఆచూకీ లేకుండా పోయాడు… గుత్తా వెంకటేశ్వర్లుకు భార్య దీపిక, కుమార్తెలు మోక్షిత, రఘవర్షిణి, కుమారుడు శివధర్మ ఉన్నారు. ఆయన స్థానికంగా ఎరువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. గతనెల 30న పాఠశాల నుంచి వచ్చిన ముగ్గురు పిల్లలను వెంకటేశ్వర్లు బైక్‌పై తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో దీపిక ఫిర్యాదు చేశారు.

Latest News

వెల్దండ మండలం బుర్రకుంట సమీపంలో

పోలీసుల గాలింపులో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద ఓ హోటల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఇద్దరు పిల్లలను దించి….పెద్ద కుమార్తెతో చారకొండ మండలం జూపల్లి దాబా వరకు వెంకటేశ్వర్లు బైక్ పై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిలోని వెల్దండ మండలం బుర్రకుంట సమీపంలో చెట్ల మధ్య వెంకటేశ్వర్లు విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఆ తరువాత అదే పరిసర ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు 8 ఏళ్ళ పెద్దపాప మోక్షిత, 6 ఏళ్ళ వర్షిణి, 4 ఏళ్ళ శివ ధర్మల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో లభించాయి… ఈ ఘటనతో వెంకటేశ్వర్లు స్వగ్రామం బోయలపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-shikhar-dhawan-ed-notices-cricketer-shikhar-dhawan-in-money-laundering-case/crime/541118/

boyalapalli Breaking News Family Disputes guttavenkateswarlu latest news missing children nagarkurnool district prakasam district Telugu News yerragondapalem

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.