ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు నెలలో అనేక జిల్లాలు వర్షాలతో సతమతమయ్యాయి. రోడ్లు దెబ్బతినడం, పంటలు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా (Power supply) లో అంతరాయం కలగడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో కొత్త వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాతావరణ శాఖ వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా 1.5 నుండి 1.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
భారీ వర్షాలు పడే అవకాశముందని
దీని ప్రభావంతో రేపు (సెప్టెంబర్ 2) నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.అల్పపీడనం ఏర్పడితే తూర్పు గాలులు బలంగా వీచి, తీరప్రాంతాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర తీర జిల్లా (North Andhra Coastal District) ల్లో గాలివానలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు.ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాతావరణ శాఖ
కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.తీరం వెంబడి గంటకు 40–60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరా అంతరాయం, వరదల ప్రమాదాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: