విజయవాడ : లల్లాదేవిగా Lalladevi తెలుగు పాఠకులకు సుపరిచితులైన నప్రముఖ నవలా రచయిత పరుచూరి నారాయణ చార్యులు(82) శుక్రవారం వేకువజామున కన్ను మూశారు. ఆయన 150పైగా నవలలు రాశారు. 150కిపైగా నవలలు, కొన్ని నాటకాలు.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన రచ నలు.. ఆమ్రపాలి, మహామంత్రి తిమ్మరుసు, వైద్య విజ్ఞానం పంచే రచనలు ఎయిడ్స్, వాత్సాయన కామసూత్రాలు వగైరా.. ఇలా బహుముఖీనమైన ప్రతిభతో రచనా వ్యాసాంగం ద్వారా తెలుగు సాహి త్యాన్ని పరిపుష్టం చేశారు. లల్లాదేవి శ్వేతనాగు గత శతాబ్దంలో అంటే 1980-90వ దశకంలో ఒక సంచలనం. వేలకొలది కాపీలు అమ్ముడు పోవడమేకాక కీర్తిప్రఖ్యాతలు తెచ్చిన నవల.
Crime: మైనర్ బాలికను చంపి, యువకుడు ఆత్మహత్య
Lalladevi
ఆ నవలను సినిమా కూడా తీశారు. 1982లో యార్లగడ్డ రాజ్యలక్ష్మీవెంకన్నచౌదరి కళాపీఠం అవార్డు, యల్లాప్రగడ సుబ్బారావు మెమోరియల్ పురస్కారం, డా. పఠాభి కళాపీఠం విజయవాడవారిచే ఉత్తమ నవలారచయితగా ఎంపికై ‘గోల్డ్ మెడల్’, ప్రశంసా పత్రం, లైఫ్గమ్ ఎచీవ్మెంట్అవార్డు, గుంటూరు జిల్లా ఉగాది పురస్కా రాలు మూడుసార్లు, 1985 ప్రపంచ తెలుగు మహాసభల సావనీర్కు ఎం పికై, కథ ప్రచురితమైంది. 14 నవలలు కన్నడంలోకి అనువాదమై, వివిధ కన్నడ పత్రికల్లో ధారావాహికంగాను, నవలలుగాను వెలువడ్డాయి. ఆయన తిరుచరణాలు చారిత్రక నవల ‘శ్రీచరణ్’గా హిందీలోకి అనువాదమై వెలువడింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో, ధర్మప్రచార పరిషత్ (గుంటూరు) పురాణ పండిట్గాను, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోను, ఎపి ఆస్థాన పౌరాణిక ప్రవచకారునిగాను, స్వగ్రామంలో వైష్ణవ అర్చకస్వామి గాను, కొన్ని ఛానల్స్ లో ఆస్ట్రాలజీ ప్రొగ్రామర్గా పనిచేసారు. రాష్ట్ర సాంస్కృ తిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లల్లాదేవి Lalladevi మృతి పట్ల విచారం వ్యక్తం చేసారు.
లల్లాదేవి ఎవరు?
లల్లాదేవి అనగా పరిచయమైన పేరు, అసలు పేరు పరుచూరి నారాయణ చార్యులు. ఆయన ప్రముఖ తెలుగు నవలా రచయిత.
ఆయన వయస్సు మరియు మరణ సమయం?
వయసు 82 సంవత్సరాలు. శుక్రవారం వేకువజామున కన్ను మూశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: