భారతదేశంలో శ్రామిక చట్టా లకు కొత్త శకం ఆరంభ మైంది. కేవలం చారిత్రక సంస్క రణ మాత్రమే కాదు, దేశంలోని ప్రతి శ్రామికుడికి గౌరవాన్ని, భద్రతను కల్పించే దిశగా ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకో వడం హర్షణీయం. కేంద్రప్రభు త్వం చరిత్రాత్మక నిర్ణయంతో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపనున్నాయి. దశాబ్దాలుగా అమలులో ఉన్న కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కార్మిక కోడ్లను అమలు చేయడంవల్ల దేశ వ్యాప్తంగా కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన కార్మిక చట్టాలు దేశాభివృద్ధికి బాటలు వేసే సంస్కరణలు. దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఇది ఒక గొప్ప సంస్కరణగా నిలుస్తుంది. సరళత, పారదర్శకత, సమర్ధత, కార్మికుల సంక్షేమానికి నాలుగు నూతన కార్మిక చట్టాలు దోహదపడతాయి. నూతన చట్టాల వల్ల కీలక మార్పులతో అందరికీ సాంఘిక భద్రత, అసంఘటిత రంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్పార్మ్ వర్కర్లవంటి వర్గాలకు కూడా రక్షణ పొందే అవకాశం లభించింది. నూతన కార్మిక చట్టాలతో పరిశ్రమలకు సరళీకృత విధానాలు, పెట్టు బడులు, ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారు. అంతేకాకుండా వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, తదితర అంశాలు ఈ చట్టాలతో మెరుగైన పద్ధ తిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టాలు కాగితాలపైనే కాకుండా కార్మికుల జీవితాల్లో మార్పు తీసు కువస్తాయి. ఇప్పటివరకు ఉన్న 29 పాత కార్మిక చట్టాలను సరళతరం చేస్తూ, దేశంలోని 40కోట్ల మందికి పైగా కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలకు హామీ లభిస్తున్నది. దేశంలోని 40 కోట్ల మంది, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది కార్మికులకు కనీసవేతనం, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి కీలక ప్రయోజనాలను లభించనున్నాయి.
Read Also : SBI: ఎస్బీఐ సరికొత్త రికార్డు: స్టాక్ విలువ ఆల్‌టైమ్ హై
ప్రధాన సంస్కరణలు
తాజా కోడ్లలో మహిళలకు హక్కులు, భద్రతను మరింత పెంచడం, ప్రమాదకరమైన ప్రాసెసింగ్ కేంద్రాలు సహా అన్ని చోట్లా దేశవ్యాప్తంగా ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం, సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్, రిటర్న్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి ప్రధాన సంస్కరణలు ఉన్నాయి. ఈ నాలుగు స్మృతులతో ఉపాధిని సంఘటితం చేయడం, కార్మి కుల సంరక్షణనుబలోపేతం చేయడం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయడంతోపాటు అంతర్జాతీయంగా అనుసంధానించవచ్చు. మనదేశంలో 1930-50 మధ్య రూపొందించిన కార్మిక చట్టాలే నేటికి అమలు లో ఉన్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో ప్రస్తుత తరానికి ఆ చట్టాలు సరిపోవనే ఆందో ళనలు ఉన్న సంగతి విదితమే. దశాబ్దాల నాటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన చట్టాలను అమలుచేయడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు, ఫ్యాక్టరీలకు కష్టంగా మారింది. అలాగే కార్మికులకు సరైన భద్రత, సంక్షేమం అందడం లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సమస్యలను అధిగమించేందుకు నూతన కార్మిక కోడ్లను కేంద్రం రూపొందించడం ద్వారా కార్మికు లకు ఎంతో మేలు చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న కార్మిక చట్టాలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కొత్త లేబర్ కోడ్ల (Labor Codes)ప్రకటించింది. వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక సం బంధాల కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరి స్థితుల కోడ్ 2020 ఇందులో ఉన్నాయి. ఇవి ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న కార్మిక చట్టాలను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కొత్త లేబర్ కోడ్ల (Labor Codes)ను ప్రకటించింది. వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 ఇందులో ఉన్నాయి. ఇవి ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి అన్ని రంగాలకూ వర్తించనున్నాయని… కార్మికుల భద్రత మెరుగుపర్చడానికి, అలసటను తగ్గించడానికే కాక భద్రత, అదనపు ప్రయోజ నాలు లభిస్తాయని చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను హేతుబద్ధం చేసినట్లు అవుతుందని కేంద్ర ప్రభుతం చెబుతోంది. దీని ద్వారా మెరుగైన కార్మిక, ఉద్యోగ విధానాలు అమల్లోకి రానున్నాయి.
రోజుకు ఎనిమిది గంటలు
కొత్త కార్మిక నియమావళి ప్రకారం అతిపెద్ద మార్పు లలో ఒకటి రోజువారీ పని పరిస్థితులు, ఉద్యోగులు ఎంత కాలం పని చేస్తారు, వారు ఎప్పుడు వేతనంతో కూడిన సెలవులకు అర్హులు, వారు ఎంత ఓవర్ టైం తీసుకోవచ్చు, వారు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలకు అర్హులు లాంటివి నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు, ఉద్యోగులు వార్షిక వేతనంతో కూడిన సెలవుకు అర్హత సాధించడానికి ముందు ఒక క్యా లెండర్ సంవత్సరంలో 240పని దినాలను పూర్తి చేయాల్సి ఉండేది. కొత్త కోడ్లు ఆ అవసరాన్ని 180రోజులకు తగ్గిం చాయి. అంటే ఇప్పుడు ఒక కార్మికుడు ఏడాదిలో చాలా ముందుగానే సెలవుకు అర్హుడు అవుతాడు. ఇది తయారీ, వస్త్రాలు, రిటైల్, నిర్మాణం, హాజరు నియమాలు సాంప్రదాయకంగా కఠినంగా ఉండే ఇతర రంగాలలోని వారికి పెద్ద మార్పు అని చెప్పవచ్చు. కొత్త కోడ్ ల ప్రకారం రోజుకు ఎనిమిది గంటలు, వారానికి 48 గంట లు పనిచేయాలనే నియమం అలానే ఉంటుంది. కానీ వాటిని ఎలా ఏర్పాటు చేసేకో వచ్చనేది మాత్రం మారుతుంది. దీనిని వారంలో నాలుగు రోజులు 12గంటలు, ఐదు రోజులు వారాంలో దాదాపు 9.5 గంటలు, ఆరు రోజులు వారంలో రోజుకు ఎనిమిది గంటలు కింద విభజించుకోవచ్చును. దీంతో పాటూ ఓవరైమ్ పరిమితిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమసొంత పరిమితులను నిర్ణయించుకోవచ్చు. కొత్త కోడ్లలో మరో ప్రధాన మార్పుఆరోగ్యం, వైద్యకవరేజ్. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఉద్యోగికి ఇప్పుడు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీ లభిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ గంటలు, ప్రమాదకర వాతావరణాలు లేదా శారీరకఒత్తిడి సాధారణం గా ఉండేరంగాలలో, నివారణ ఆరోగ్య సంరక్షణ వైపు విస్తృ త ప్రయత్నంలో ఇది భాగంగా ఉంటుంది. ముఖ్యంగా, తోటల కార్మికులకు ఇప్పుడు గతంలో ఒకేవిధంగా అందు బాటులో లేని వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ నిబంధన కార్మికులకు అనుకూలంగా ఎన్డీయే ప్రభుత్వం ఈ కోడ్లను రూపొందించింది. ఈ కోడ్లతో కార్మికులందరికీ కనీస వేతనాలు లభిస్తాయి. యువతకు నియామక పత్రాలు అందుతాయి, మహిళలకు సమాన వేతనాలు, గౌరవం లభిస్తుంది. 40కోట్లమంది కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుంది, ఫిక్స్ డ్ టెర్మ్ ఉద్యోగులకు ఏడాది పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ వంటివి దక్కుతాయి. 2047కల్లా అభి వృద్ధి చెందిన భారత్ నిలవాలన్న లక్ష్యానికి ఊతం.
– వాసం శెట్టి సుభాష్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: