నిరంతరం హక్కులు బాధ్యతల మధ్య నలిగి పోయే కార్మిక సమాజానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్న వరప్రసాదంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఈ కోడ్ల గమనాన్ని కసరత్తు చేశారు. ఈ నాలుగు కార్మిక స్మృతులుఅమల్లోకి రావడంతో కార్మికులందరికీ సామాజిక భద్రతఏర్పడ్తుంది. ఎన్నాళ్లుగానో ప్రభుత్వం కార్మిక చట్టాలను సంస్కరించా లని చూసినా కార్మిక సంఘాల నుంచి తీవ్ర అభ్యంత రాలు వచ్చాయి. కొన్ని అంశాలపై కేంద్రానికి కార్మిక సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దశాబ్దాల నాటి పాత 29కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు ( labour code) నిర్ణయించారు. దేశ స్వాతంత్ర్య ఫలసాధన తర్వాత తొలిసారిగా కార్మిక చట్టాలకు నిజాయితీగా రూప కల్పన చేసినట్లు కేంద్రం ప్రకటించుకుంది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగుస్మృతులను తక్షణమే అమ ల్లోకి తెస్తున్నట్లు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. ఈ సంస్కరణలన్నీ నారీశక్తి, యువశక్తికి మెరుగైన ఉపాధి అవ కాశాలను కల్పిస్తాయని, సార్వత్రిక సామాజిక భద్రతకు పటిష్టమైన పునాదులు వేస్తాయని ప్రధాని నరేంద్రమోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ఠంచనుగా వేతన బట్వాడా మహిళా సాధికారత, సామాజిక భద్రత అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో సంస్కరణలు రూపొం దించినట్లు కేంద్ర కార్మిక మంత్రి మనస్సుఖ్ మాండవీయా కూడా ఢంకా భజాయించి చెబుతున్నారు. ప్రధానంగా అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఉపాధిని సంఘటితపరచడం కార్మికుల సంరక్షణను బలోపేతం చేయడం, కార్మిక నిర్వహణ వ్యవస్థను సులభతరం, సురక్షితం చేయడంతోపాటు అంతర్జా తీయంగా అనుసంధానించవచ్చుననే బలమైన అభిప్రాయం తో కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఈ స్మృతులను రూపొం దించింది. ఇవి ఆత్మనిర్భర భారత్కు పునాదుల్లాంటివని విశ్వాసంతో ముందుకు కదులుతున్నారు. కాలం చెల్లిన చట్టాలను సుసంపన్నమైన రీతిలో తిరగరాయించడంలో కార్మిక సంక్షేమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాలకు రూపకల్పన చేశారు. ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ పని విధానాలు పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితుల్లో క్రోడీ కరించుకున్న చట్టాలు దేశ కాల మాన పరిస్థితుల రీత్యా కార్మిక సంస్కరణలు తప్పలేదు. ఎన్నోదేశాలు తమ కార్మిక చట్టాలను సవరించుకుంటూ వస్తున్నా భారతదేశంలో కార్మిక ఉద్యమం బలీయంగా ఉన్నందున కొంత జాప్యమే జరిగింది. ఎప్పటికైనా సంస్కరణలు తప్పవు. అవి ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. 2019-20లో పార్లమెంట్లో ఆమో దించిన నాలుగు కొత్త లేబర్ కోడ్ల ( labour code)ను తాజాగా నోటిపై చేసినందున తక్షణం అమల్లోకి వస్తాయి. 45 రోజుల్లో ఈ కోడ్లకు సంబంధించిన విధి విధానాలను, నియమ నిబంధనలను కార్మికలోకం ముందుంచుతారు. చట్టం అమ ల్లోకి వచ్చినందున ఇకపై కార్మికులెవరైనా రోజుకు 8-12 గంటల చొప్పున అంటే వారంలో గరిష్౦గా 48గంటలు విధులు నిర్వహించవచ్చు. కాగా ఓవరైమ్ డ్యూటీ చేస్తే అట్టి కార్మికులకు రెట్టింపు వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. కష్టేఫలి అన్నమాట. వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాలు కోడ్, సామాజిక భద్రత కోడ్,వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిప్రదేశంలో పనిచేసే పరిస్థితుల కోడ్ ఇవన్నీ కార్మిక సంరక్షణ భద్రతలకు లోబడి ఈ జాబితాలో సమ కూర్చారు. 40కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత లభించే మార్పులివి. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది సర్వీసు ఉంటే గ్రాట్యూటీ వంటి సౌకర్యాలు దక్కుతాయి. 2047 కల్లా అభివృద్ధి చెందిన స్వయం సమృద్ధభారత్ గా ఎదిగేందుకు ఇవన్నీ మంచి మార్గదర్శకం చూపుతా యన్న ఆశయం నెరవేరితే మంచిదే. కొత్త కోడ్ల కింద ఉద్యోగులందరికీ నియామక పత్రాలు ఇవ్వడం యాజమా న్యం బాధ్యత. అలాఇవ్వని యాజమాన్యాలపై చర్యలు తప్పవు. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కనుక కార్మికులు ఎంతో సంతోషంగా ఉంటారని ప్రభు త్వం భావిస్తుండగా ట్రేడ్ లేబర్ యూనియన్లు మాత్రం ఈకోడ్లకు కొత్తభాష్యం చెబుతున్నాయి. కంపెనీలు మూసి వేత, ఉద్యోగాల కోత, సమ్మె, కనీస వేతనాల్లో స్పష్టత ఏ అంశం గురించి విశ్లేషించినా అవి యాజమాన్యాలకే ప్రయోజనం కలిగిస్తాయని ఆరోపిస్తున్నారు. ప్రతి కార్మికు నికి కనీస వేతనం నెలకు 26వేలుగా నిర్ణయించాలని కార్మిక సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆకస్మిక నిరసనలను వ్యక్తంచేసే అవకాశం ఇవ్వకుండా కార్మికుల గొంతును నొక్కివేసినట్లు అవుతుందని భావిస్తు న్నారు. కార్మికుల విషయంలో కంపెనీలు చేసే అపరాధాలకు కేవలం జరిమానాలతో సరిపెట్టింది. జైలు శిక్ష అన్నదే లేకుండా యాజమాన్యాలకు వెసులుబాటు. వెన్ను విరిచే విధంగా ఎలాంటి శిక్షలు లేకపోతే వారికి కార్మికు లంటే చులకన భావం ఏర్పడ్తుంది. ప్రమాదకర పరిస్థి తుల మధ్య పనిచేసే కార్మికుల ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేకంగా నిర్ణయించింది. ఏమీ లేదని సంఘాలు గొంతె త్తి అరుస్తున్నాయి. గిగ్, ప్లాట్ ఫారమ్ వర్కర్ల స్థితిగతులు బాగుకు నిర్దిష్ట విధివిధానాలు రూపొందించారు. వీరు ఇతరరాష్ట్రాలకు వెళ్లినా సంక్షేమ పథకాల ప్రయోజనా లు ఆగిపోకుండా మార్గం చూపారు. వలస కార్మికులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ద్వారా మేలు కలుగుతుం ది. డాక్ వర్కర్లు, ఐటి ఉద్యోగులు, ఔళి కార్మికులు, గని కార్మికుల ప్లాంటేషన్ వర్కర్లు సంక్షేమ ప్రయోజనాలపై కేంద్రప్రభుత్వం విస్తృతంగా విశ్లేషించింది. ఎన్నో కోణాల నుంచి ఆలోచించి చట్టాలు వాటి విధి విధానాలను రూపకల్పన చేసినా అమలులో వెనుకబడితే అంతా బూడిదలో పోసిన పన్నీరే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: