📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

News Telugu: Kyvalya Reddy: అమెరికా వ్యోమగామి శిక్షణకు ఎంపికైన ఏపీ అమ్మాయి

Author Icon By Rajitha
Updated: November 7, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kyvalya Reddy: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి కుంచాల కైవల్య రెడ్డి అంతరిక్ష రంగంలో అరుదైన విజయాన్ని సాధించింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆమె, అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే ప్రతిష్ఠాత్మక వ్యోమగామి శిక్షణ (Astronaut training) కార్యక్రమానికి ఎంపికయ్యారు. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 150 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వారిలో కైవల్య ఒకరిగా నిలవడం గర్వకారణం. నాలుగేళ్ల పాటు సాగే ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత, ఎంపికైన వారు 2029లో అంతరిక్ష యాత్ర చేయనున్నారు. ఈ యాత్రలో వ్యోమగాములు భూమి నుంచి 300 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి, 3 గంటలపాటు జీరో గ్రావిటీని అనుభవించనున్నారు.

Read also: AP Police Recruitment: ఆంధ్రాలో నిరుద్యోగ యువతకు శుభవార్త..

Kyvalya Reddy: అమెరికా వ్యోమగామి శిక్షణకు ఎంపికైన ఏపీ అమ్మాయి

17 ఏళ్ల వయసులోనే

Kyvalya Reddy: కైవల్యకు నాసా మాజీ వ్యోమగాములు విలియం మెక్‌ఆర్థర్‌, బ్రెజిల్ తొలి వ్యోమగామి మార్కోస్ పోంటెస్‌ శిక్షణ ఇవ్వనున్నారు. కైవల్య తండ్రి శ్రీనివాసరెడ్డి నిడదవోలు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా, తల్లి విజయలక్ష్మి గృహిణి. చిన్నప్పటి నుంచే అంతరిక్షం, ఖగోళశాస్త్రంపై ఆసక్తి ఉన్న కైవల్య భవిష్యత్తులో ఆస్ట్రోఫిజిక్స్‌లో ఉన్నత విద్యను జర్మనీలో అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 17 ఏళ్ల వయసులోనే ఈ స్థాయికి చేరిన కైవల్య, 2023లో నాసా ఆధ్వర్యంలో జరిగిన “ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్” (IASP) లో కూడా పాల్గొని అమెరికాలో శిక్షణ పొందింది. ఆమె పట్టుదల, కృషి భవిష్యత్తులో భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం రాసే అవకాశం ఉందని పలువురు అభినందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Kunchala Kaivalya Reddy latest news Space Training Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.