కర్నూలు జిల్లా(Kurnool Road Accident)లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాంతకంగా మారింది. ఎమ్మిగనూరు అసెంబ్లీ పరిధిలోని కొటేకల్ గ్రామం(Kotekal Village) సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
లభించిన సమాచారం ప్రకారం, ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై అధిక వేగంతో వస్తున్న రెండు వాహనాలు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి బలంగా ఢీ కొనాయి. ఢీకొన్న తీవ్రతకు వాహనాలు పూర్తిగా దెబ్బతిని ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.
Read Also: Crime: ఉపాధ్యాయుడిని దేహశుద్ధి చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రి(Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు(Kurnool Road Accident) చేసిన పోలీసులు ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: