Kurnool: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది మృతిచెందారు. మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసాయి. బస్సు నుంచి ఇప్పటివరకు 19 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Read also: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
Kurnool: కర్నూల్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ పలువురు
అయితే, ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎం. సత్యనారాయణ, హైదరాబాద్ మియాపూర్ (Miyapur) కు చెందిన జయసూర్య, హయత్‌నగర్‌కు చెందిన నవీన్‌కుమార్, బెంగళూరుకు చెందిన సరస్వతి నిహారిక ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కొత్తపేటకు చెందిన నీలకుర్తి రమేశ్ కుటుంబం భార్య శ్రీలక్ష్మి, పిల్లలు జస్విత, అభిరామ్ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు గాయాలతో చికిత్స పొందుతున్నారని, ఇంకా కొంతమంది వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఏ ప్రమాదం జరిగింది?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు దగ్ధమై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు?
మొత్తం 19 మంది ప్రయాణికులు మృతిచెందారు.