📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kurnool Road Accident: లారీ, ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరు యువకులు మృతి

Author Icon By Rajitha
Updated: March 18, 2026 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు జిల్లా గోనెగండ్ల, లారీ, ద్విచక్రవాహనం డీ కొన్న ప్రమాదంలో బోయ మునిస్వామి(31), మొండి వీరేష్(17) ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు, మృతుల బందువులు అందించిన సమాచారం మేరకు బోయ మునిస్వామికి తల్లి మద్దమ్మ, భార్య సిమ్రాన్ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అలాగే మొండి వీరేష్కు తల్లి అచ్చమ్మ, ఉన్నారు. ఈ రెండు కుటుంబాలది కూలీ పనుల చేసి జీవనం సాగించే వారు.

బోయ మునిస్వామి, మొండి వీరేష్లు చిన్నప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు స్వంత గ్రామంలో పనులు లేక పోవడంతో జీవనం కష్టంగా మారింది. దీంతో ఈ రెండు కుటుంబాల సభ్యులు తెలంగాణా రాష్ట్రం, నాగర్ కర్నూలులోని ఇప్పలపల్లి గ్రామంకు గత రెండు నెలల క్రితం బ్రతుకు తెరువు కోసం వలస వెళ్లారు. ఉగాది పండుగకు స్వంత గ్రామం చేరాలని తలచి కుటుంబసభ్యులతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇప్పలపల్లె నుంచి గోనెగండ్లకు చేరారు.

Read also: Badvel Kadapa News: సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

Kurnool Road Accident: Lorry and Two-Wheeler Collide; Two Youths Dead

ఉదయం 10.45 గంటలకు ఇద్దరు స్నేహితులు మునిస్వామి, మొండి వీరేష్లు గంజహళ్లి క్రాస్రోడ్డు దగరకు తమ ద్విచక్రవాహనంలో వచ్చారు. అక్కడ స్వంత పని ముగించుకొని బస్టాండ్ దగ్గగ్గరకు ఇద్దరు ద్విచక్రవాహనం(ఏపీ 39, జే క్యూ 6383) పై వెలుతుండగా ఎమ్మిగనూరు వైపు నుంచి (ఏపీ 21 వై 6667) అనే లారీ వేగంగా అజాగ్రత్తగా వచ్చి వెనుక వైపు నుంచి డీ కొన్నది. దీంతో ద్విచక్రవాహనంపై వస్తున్న బోయ మునిస్వామి, మొండి వీరేష్లు ద్విచక్రవాహనంతో పాటు లారీ చక్రాల కింద పడ్డారు. మునిస్వామి అక్కడిక్కడే మృతి చెందాడు, వీరేష్ను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరేష్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్వంత గ్రామానికి చేరుకున్న కొన్ని గంటలలోపే ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదం అలముకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Boya Muniswamy Gonegandla Road Accident Kurnool News latest news Lorry Bike Collision Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.