📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Kurnool Crime: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర విచారం

Author Icon By Aanusha
Updated: October 24, 2025 • 9:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనను అధికారులు దుబాయ్ (Dubai) పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎస్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.

Kurnool Crime: ట్రావెల్స్ బస్సులో మంటలు.. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి?

Kurnool Crime

తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత త్వరగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

మృతుల సంఖ్య మరింత పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో జరిగి బస్సు ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Chandrababu Naidu Kurnool bus accident latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.