📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Latest News: Kurnool Tragedy: కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి

Author Icon By Aanusha
Updated: October 24, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు (Kurnool) జిల్లా లో కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.. మరికొందరు తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Kurnool Crime: ట్రావెల్స్ బస్సులో మంటలు.. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి?

ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంల వరకు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ (Vice President C.P. Radhakrishnan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “కర్నూలులో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా దురదృష్టకరం.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Kurnool Crime

మెరుగైన వైద్య సహాయం అందించాలి

ఏపీ అధికారుల‌తో మాట్లాడి అవ‌స‌‌ర‌మైన స‌హాయ‌క‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర అధికారుల‌ను ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. గ‌ద్వాల కలెక్ట‌ర్‌, ఎస్పీ ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లాల‌ని సీఎం ఆదేశించారు.మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కూడా ఈ దుర్ఘటనపై స్పందిస్తూ,

“ఈ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలి” అని కోరారు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు ఎమర్జెన్సీ డోర్ అద్దాలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది

చూస్తుండగానే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడంతో మిగిలిన వారు బయటకు రాలేకపోయారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు.

ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించి, వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని రవాణా, సహాయక బృందాలకు మంత్రి సూచనలు జారీ చేశారు

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh tragedy Breaking News Draupadi Murmu condolence Kurnool bus accident latest news Telugu News Vice President CP Radhakrishnan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.