కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది.. ఈ ఘటనలో మృత్యువును చూసి మళ్లీ తిరిగి వచ్చిన వారిలో బస్సు రెండో డ్రైవర్ శివనారాయణ కూడా ఒకరు. ఆయన చెబుతున్న వివరాలు ఇప్పుడు గుండెలను పిండేస్తున్నాయి.
Read Also: Mother Kills Son : డబ్బు కోసం కన్నకొడుకునే హత్య చేసిన తల్లి
ప్రమాదం జరిగిన సమయంలో తాను బస్సు కింద భాగంలోని కార్గో క్యాబిన్ (Cargo cabin) లో నిద్రిస్తున్నానని, ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు,
మంటలు ఎక్కువగా ఉండటంతో బయటకు రావడం కష్టమైంది
ఇద్దరం కలసి ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదు. డ్రైవర్ సీటు దగ్గర మంటలు ఎక్కువగా ఉండటంతో బయటకు రావడం కష్టమైంది.ఆ మార్గంలోనే కొంతమందిని బయటకు లాగాం,” అని ఆయన చెప్పారు.
ఆ ప్రయత్నం వల్ల 27 మంది ప్రాణాలతో బయటపడ్డారని, ఆ క్షణాలు తనకు ఇప్పటికీ భయానకంగా అనిపిస్తున్నాయని తెలిపారు.ఈ ప్రమాదంలో మొత్తం 46 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అందులో 19 మంది దుర్మరణం చెందగా, మిగిలినవారు గాయాలపాలయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: