Latest News: Kurnool Bus Tragedy: బస్సు ప్రమాదం..18 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత

Read Time:  1 min
Latest News: Kurnool Bus Tragedy: బస్సు ప్రమాదం..18 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత
FONT SIZE
GET APP

కర్నూలు సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ పరిస్థితిలో అధికారులు డీఎన్ఏ (DNA) పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.

Read Also: Women Cricketers: ఆస్ట్రేలియా క్రికెటర్లపై వేధింపులు.. నిందితుడికి  తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చిన పోలీసులు

గత రెండు రోజులుగా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో నిపుణుల బృందం డీఎన్ఏ నమూనాల సేకరణ, విశ్లేషణ పనులు శాస్త్రీయ పద్ధతుల్లో కొనసాగించింది. డీఎన్ఏ పరీక్షల ప్రక్రియ ఆదివారం పూర్తి కావడంతో అధికారులు మృతదేహాలను కుటుంబాలకు అందజేశారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ. సిరి ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు మరణ ధృవీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేశారు. మృతులలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్,

పోలీసుల దర్యాప్తులో ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు

ఆరుగురు తెలంగాణకు చెందిన వారు కాగా.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన చెరో ఇద్దరు, ఒడిశా, బీహార్‌కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉండటంతో దానిని జీజీహెచ్‌లోనే భద్రపరిచారు. ఇంతలో, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి ఈ ప్రమాదంలో మరణించి ఉండవచ్చని పోలీసులను ఆశ్రయించడంతో, డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

Kurnool Bus Tragedy
Kurnool Bus Tragedy

పోలీసుల దర్యాప్తులో ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. బి. శివశంకర్ (22) అనే యువకుడు మద్యం మత్తులో బైక్ నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వెనుక కూర్చున్న ఎర్రిస్వామి అలియాస్ నాని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

బస్సుకు మంటలు అంటుకోవడం చూసి భయంతో

ప్రమాదం తర్వాత, రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను పక్కకు తీసేలోపే వేగంగా వచ్చిన బస్సు దానిని ఢీకొట్టింది. బస్సుకు మంటలు అంటుకోవడం చూసి భయంతో నాని అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదానికి ముందు పెట్రోల్ పంపు వద్ద రికార్డయిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఎర్రిస్వామిని గుర్తించి, అతని స్వగ్రామం తుగ్గలిలో అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటనపై ఓ ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య, వి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్‌లపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.