అమరావతి: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కావేరి ట్రావెల్స్(Kaveri Travels) బస్సు దుర్ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ (High-level committee) వేసి విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు వంగలపూడి అనిత,(Vangalapudi Anitha) మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని, ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వారు పరామర్శించారు.
Read Also: Maharashtra crime: సబ్ ఇన్‌స్పెక్టర్ అత్యాచారం తో మహిళా డాక్టర్ ఆత్మహత్య
విచారణ కమిటీ, మృతుల వివరాలు
ఈ ఘటనపై ఏర్పాటు చేసే విచారణ కమిటీలో పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారని మంత్రులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది పెద్దవారు, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారని వివరించారు. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 42 మందిలో 19 మంది సజీవదహనమయ్యారు. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో మిగతా 27 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడ్డారు. మృతుల్లో కోనసీమ, నెల్లూరు, బాపట్ల జిల్లాల వాసులున్నారని తెలిపారు.
ఫోరెన్సిక్ దర్యాప్తు, నిందితులపై చర్యలు
మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో, వాటిని గుర్తించడానికి 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేశామని హోంమంత్రి అనిత వివరించారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులందరిపై చర్యలు ఉంటాయని, ఇప్పటికే కేసులు నమోదు చేశామని తెలిపారు. బస్సు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి అనిత హామీ ఇచ్చారు.
కర్నూలు బస్సు దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంది?
ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆదేశించింది.
ఈ కమిటీలో ఏఏ శాఖల అధికారులు ఉంటారు?
పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: