📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: Kurnool: చంద్రబాబు, పవన్ విజన్ తో దుసుకెళ్తున్న ఏపీ: మోదీ

Author Icon By Sushmitha
Updated: October 16, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు: (Kurnool)కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయడంతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూపంలో రాష్ట్రానికి శక్తిమంతమైన నాయకత్వం లభించిందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో గత 16 నెలలుగా ఏపీ అపూర్వ ప్రగతి సాధిస్తోందని ఆయన ప్రశంసించారు. గురువారం కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సుమారు ₹13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీ, పరిశ్రమలు, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన వివరించారు.

Read Also: Meesaala Pilla: యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న మీసాల పిల్ల

చంద్రబాబు, పవన్‌లపై ప్రశంసలు

రాష్ట్ర నాయకత్వంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. “ఏపీలో విజన్ ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఉన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం కూడా ఉంది. వీరి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతోంది” అని అన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, అహోబిళం, మహానంది, మంత్రాలయం స్వాముల ఆశీస్సులు కోరుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్’ కారణంగా గత 16 నెలల్లో ఏపీ అనూహ్య ప్రగతి సాధిస్తోందని, 2047 నాటికి వికసిత భారత్‌గా మారాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక సహకారం అందిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు.

రాయలసీమ అభివృద్ధి, గూగుల్ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ(Rayalaseema) అభివృద్ధి చాలా ముఖ్యమని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఓర్వకల్, కొప్పర్తిలలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్లు రాయలసీమ రూపురేఖలను మారుస్తాయని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోందని, గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అమెరికా వెలుపల తమ అతిపెద్ద పెట్టుబడిని ఏపీలో పెడుతున్నట్లు ఆ సంస్థ సీఈఓ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) (ఏఐ) హబ్, డేటా సెంటర్, సబ్-సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని, ఈ సబ్-సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్‌వేగా మారనుందని మోదీ తెలిపారు.

ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర

దేశ ఇంధన భద్రతలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని కొనియాడారు. గతంలో విద్యుత్ సంక్షోభాలు ఉండేవని, ఇప్పుడు తమ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోందని అన్నారు. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లకు పెరిగిందని, ప్రతి ఇంటికి, పరిశ్రమకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని చెప్పారు. చిత్తూరు ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ రోజుకు 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యంతో పనిచేస్తోందని, సహజవాయువు పైప్‌లైన్‌తో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా అవుతుందని వివరించారు.

ప్రధాని మోదీ ఎన్ని కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు?

రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ప్రధాని మోదీ ఎవరిని ఉద్దేశించారు?

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వాల (చంద్రబాబు, పవన్ కల్యాణ్) పాలనను ఉద్దేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AP visit Chandrababu Naidu Double Engine Sarkar Google News in Telugu GST Utsav Latest News in Telugu Pawan Kalyan PM Narendra Modi Telugu News Today Visakhapatnam AI Hub.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.