కుప్పం : ఆంధ్రప్రదేశను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి(Bhuvaneshwari) అన్నారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి కుప్పం వాసుల దశాబ్దాల కల నెరవేర్చారని అన్నారు. మహిళలకు ఆర్థిక భద్రత అవసరమని, స్వయం ఉపాధి ద్వారా వారికి మరింత ఆదాయం లభిస్తుందని అన్నారు. 3వ రోజు కుప్పం నియజకవర్గం(Constituency) పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. నడింపల్లి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి ముందుగా గంగమ్మ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. వారితో కలిసి కోలాటం ఆడారు. ఆపై వారిని ఉద్దేశించి మాట్లాడుతూ… “మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో చంద్రబాబు డ్వాక్రా స్థాపించారు. నేడు డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తూ పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగారు.
Read Also: Petrol Prices: పెరగనున్న పెట్రోల్ ధరలు?
ట్రైలరింగ్, మగ్గం, చికెన్ కారీ వర్లో శిక్షణ ఇస్తున్నాం
Bhuvaneshwari: మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మన వల్ల ఏమీ కాదు అనే భావన నుంచి ముందు బయటకు రావాలి.. ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటి నుంచి నేర్చుకుని మందుకు నడవాలి. మహిళల్లో ప్రతిభను వెలికితీసి వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడంలో ఎలీప్ చేస్తున్న కృషి అభినందనీయం. రమాదేవి ఆమె టీం సభ్యులంతా ఎలీప్ ద్వారా అనేకమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా మహిళల ఆర్ధిక ప్రగతికి పాటుపడుతున్నాం. వారి స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నాం. ట్రైలరింగ్, మగ్గం, చికెన్ కారీ వర్లో శిక్షణ ఇస్తున్నాం. నడింపల్లిలో 198 మందికి పింఛను అందుతోంది. టిద్కో కింద 62 గృహాలు, రూ.1.30 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారు. తల్లికి వందనం పథకం కింద 155 మంది లబ్ది పొందుతున్నారు. 147 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్ధిక సాయం అందింది” అని నారా భువనేశ్వరి వివరించారు.
“రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశారు. చంద్రబాబు దూరదృష్టితో కుప్పానికి నీటి కష్టాలు తీరాయి. కుప్పంలో ప్రతి గ్రామం పచ్చగా ఉండాలన్నదే ఆయన కోరిక. ఇటీవల కుప్పానికి 7 పరిశ్రమలు వచ్చాయి. త్వరలో మరో 8 సంస్థలు రాబోతున్నాయి. గత ఐదేళ్లలో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతికారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ లభించింది. గంజాయిపై ఉక్కుపాదం మోపారు. మహిళల రక్షణ కల్పించడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేము ఎంత చేసినా కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేము. నేను నిజం గెలవాలి యాత్ర చేసినప్పుడు టీడీపీ కార్యకర్తలు, కుప్పం ప్రజల ఎంతో సహకరించారు.
అలాగే… 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు తరపున నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు మీరు నాపై చూపిన అభిమానాన్ని మర్చిపోలేను” అని భువనేశ్వరి పేర్కొన్నారు.
కృష్ణమ్మకు జలహారతి
తుమ్మిసి పెద్దచెరువు దగ్గర జలహారతి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అంతకు ముందు శాంతిపురం నుంచి తుమ్మిసి వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిం చారు. ప్రయాణికులతో ముచ్చటించారు. భువనేశ్వరి ఆర్టీసీ బస్సు ఎక్కగానే ఆధార్ తప్పనిసరి అని మహిళా కండెక్టర్ చెప్పింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నావని మహిళా కండెక్టరు భువనేశ్వరి అభినందించారు. ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ సిఎం చంద్రబాబు, నారా భువనమ్మ కుప్పం ప్రజలపై చూపుతున్న అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. అంతకుముందు నారా భువనేశ్వరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించారు. నడింపల్లిగ్రామంలో మహిళలతో సరదాగా కోలాటం ఆడారు. నారా భువనేశ్వరికి గ్రామాల్లో మహిళలు నీరాజనం పలికారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కడ పి.డి. వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్్ఫర్మన్ పిఎస్ మునిరత్నం, పికెఎం ఉడా చైర్మన్ బిఆర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టిటిడి డైరెక్టర్ వైద్యం శాంతారాం, టిడిపి మండల అధ్యక్షులు ఉదయ్కుమార్, వెంకటరమణ, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: