📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

News telugu: kuppam: కుప్పంలో ఇండస్ట్రియల్ పార్క్..భూముల సర్వేకు అధికారుల కసరత్తు

Author Icon By Sharanya
Updated: September 22, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. కుప్పం ప్రాంతంలో సీఎం చంద్రబాబు (Chandrababu)చొరవతో వివిధ కంపెనీలు భారీ పెట్టుబడులతో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ)తో సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కుప్పం ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయి.

News telugu


దక్షిణాది రాష్ట్రాలకు కుప్పం నుంచి చక్కటి రోడ్ కనెక్టివిటీ ఉండడంతో పాటు విద్యుత్, నీటి వసతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కుప్పం ప్రాంతంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అధికార యంత్రాంగం ఇండస్ట్రియల్ పార్కు (Industrial Park) అవసరమైన భూములను గుర్తించేందుకు సర్వే చేపడుతోంది.రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో ప్రస్తుతం అధికారులు సర్వే చేపడుతున్నారు.

రూ.3,908 కోట్ల పెట్టుబడులకు సుముఖం

కుప్పం నియోజకవర్గంలో దాదాపు రూ.3,908 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే సుమారు 12 కంపెనీలు సుముఖత చూపాయి. మరిన్ని పరిశ్రమలు రానున్నాయి. వీటిలో పలు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు సైతం చేసుకున్నాయి. వీటిలో మదర్ డెయిరీ, అలీప్ ఇ-రాయిస్ మోటార్స్, ఎస్విఫ్ సోయా, ఏస్ ఇంటర్నేషల్, శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్, శ్రేష్ట రెన్యూవబుల్స్ వంటి సంస్థలు కోట్లాది రూపాయలను కుప్పంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. మదర్ డెయిరీ, ఎస్ ఇంటర్నేషనల్ పరిశ్రమలకు ప్రభుత్వం ఇటీవలే రాయితీలు సైతం ప్రకటించింది. ఈ రెండు సంస్థలే రూ.785 కోట్లు పెట్టుబడుల పెడుతున్నాయి. పలు పరిశ్రమలకు గుడుపల్లె మండలం పొగురుపల్లి వద్ద ఏపీఐఐసీకి చెందిన 300 ఎకరాల్లో భూములు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగానే యువతకు ఉపాడా అవకాశాలు లభించడంతో పాటు ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఈ విషయంగా కుప్పం ఆర్డీవో శ్రీనివాసులు రాజును ‘ప్రభాతవార్త ప్రతినిధి’ సంప్రదించగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కుప్పంలొ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూసర్వే ప్రారంభించామన్నారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో భూముల లభ్యత ఏమేర ఉంద విషయంగా సర్వే జరుగుతోందన్నారు. ఇండస్ట్రియల్ పార్కుకు ఎంఆ భూములు సేకరించాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ttd-brahmotsavam-bank-donates-cleaning-machines/devotional/552063/

AP Government Projects Breaking News Chittoor Industrial Development Andhra Kuppam Industrial Park latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.