📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

APSPDCL CMD Siva Sankar: కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

Author Icon By Siva Prasad
Updated: February 28, 2026 • 10:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

APSPDCL CMD Siva Sankar: రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని విద్యుత్ స్వయం సమృద్ధి నియోజక వర్గంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ సంబంధిత అభివృద్ధి పనులపై ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

Read Also: Massive Explosion in Vetlapalem : కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

ఈ సందర్భంగా సిఎండి శివశంకర్ లోతేటి(APSPDCL CMD Siva Sankar) మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం 250 మె.వా. విద్యుత్ డిమాండ్ వుందని, ఈ విద్యుత్తును కుప్పం పరిధిలోనే పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తున్నామమని వివరించారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ద్వారా 141 మె.వా. విద్యుదుత్పత్తికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

అదేవిధంగా ఎస్సీ/ ఎస్టీ గృహ వినియోగదారులు కోసం 4.36 మె.వా. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పనులు కొనసాగుతున్నాయని, 50 మె.వా. బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపడుతున్నామని తెలియజేశారు. ఇక కుప్పం పరిధిలో 40 మె.వా. సామర్థ్యంతో మరో 49 వేల గృహాలకు కూడా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులకు సంబందించిన ప్రతిపాదనల్ని సిద్ధం చేశామన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఈ పనులు పూర్తి చేయడం ద్వారా 250 మె.వా. పునరుత్పాదక ఇంధన వనరుల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, ఈ యేడాది చివరికల్లా పనుల్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారుల్ని ఆదేశించారు.

కుప్పం నియోజకవర్గంలో ట్రాన్స్కో సబ్ స్టేషన్ ను నిర్మించేందుకు వీలుగా స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను సకాలంలో పూర్తి చేయాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్ ఖాన్, కె. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు యం. ఉమాపతి, యం. కృష్ణారెడ్డి, చిత్తూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. ఇస్మాయిల్ అహ్మద్, రెస్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. సోమశేఖర్, ఎపిట్రాన్స్కో, నెడ్ క్యాప్ అధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

APSPDCL CMD Siva Sankar Lotheti Chittoor District News Feeder Level Solarization Kuppam Power Project Renewable Energy Kuppam Rooftop Solar Schemes Solar Power AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.