📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Krishna Milk Union : పి4 నుంచి మరో విజయ ప్రస్థానం

Author Icon By Shravan
Updated: August 18, 2025 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

5,465 బంగారు కుటుంబాలకు మార్గదర్శిగా కృష్ణా మిల్క్ యూనియన్

Krishna Milk Union : పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్య మంత్రి ఆకాంక్షలకు (The Chief Minister’s aspirations) అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వినూత్న పీ4 విధానంలో మరో మైలురాయిగా నిలుస్తోంది ఈ “Victory” ప్రస్థానం. విజయ బ్రాండ్ పేరిట పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తూ.. పాడి రైతుల సంక్షేమంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ పీ4లో మేము సైతం అంటూ 5,465 గ్రామీణ బంగారు కుటుంబాలకు మార్గదర్శనం చేసేందుకు స్వచ్చందంగా ముందుకో చ్చింది. ఈ మేరకు కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులు తాజాగా నందిగామ మండలం, మునగచర్లలో జరిగిన సామూహిక గోకులం కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశకు ప్రమాణ పత్రాలు అందజేశారు. వత్సవాయి మండలం నుంచి 1,524 బంగారు కుటుంబాలు, పెనుగంచిప్రోలు మండలం నుంచి 1,192, విస్సన్నపేట మండలం నుంచి 1,255, విజయవాడ గ్రామీణ మండలం నుంచి 747, చందర్లపాడు నుంచి 747 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆంజనేయులు ప్రకటించారు. బంగారు కుటుంబాల ఆర్థికస్థితి గతులను అధ్యయనం చేసి వారి జీవితాలను సాధికారత దిశగా నడిపించేందుకు అవసరమైన చేయూత అందించనున్నట్లు పేర్కొన్నారు.

బంగారు కుటుంబాలకు చెందిన సభ్యులకు అవసరం

పాడి పశువుల కొనుగోలుకు కేడీసీసీ ద్వారా ఇచ్చే రూ. లక్ష చొప్పున రుణాలకు సంబంధించి వడ్డీని యూనియన్ భరిస్తుందన్నారు. పశు గ్రాసంతో పాటు పశు వైద్యసేవలు వంటి విషయాలపై యూనియన్ ప్రత్యేకంగా దృష్టిసారిస్తుందని.. అవసరం మేరకు సామూహిక గోకులాలు ఏర్పాటుచేసి వాటిని సద్వినియోగం చేసుకునేలా చేయిపట్టి నడిపిస్తామన్నారు. మహిళా పాడి రైతులను కూడా పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని.. పాడితో కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి అడుగులువేస్తామన్నారు. బంగారు కుటుంబాలకు చెందిన సభ్యులకు అవసరం మేరకు ఆరోగ్య సేవలు కూడా అందిస్తామని వివరించారు.

ఈ నేపథ్యంలో పాడితో పేదరికాన్ని తరిమికొట్టాలనే సంకల్పంతో వేల

మేలు జాతి పశు సంతతి, పాల ఉత్పత్తి వృద్ధికి వీలుగా పెయ్యి దూడలు పుట్టేలా లక్ష డోసుల లింగ నిర్ధారిత వీర్యాన్ని అందించేందుకు రూ. కోటి సహాయాన్ని కూడా మిల్క్ యూనియన్ ప్రకటించింది. రూ.150 విలువైన ఒక్కో డోసుకు రూ. 100 రాయితీ ఇవ్వనున్నట్లు వివరించింది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చే సత్తా పాడి పరిశ్రమకు ఉందని.. ఈ నేపథ్యంలో పాడితో పేదరికాన్ని తరిమికొట్టాలనే సంకల్పంతో వేల బంగారు గారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన కృష్ణా మిల్క్ యూనియన్కు (Krishna Milk Union) ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని యూనియన్లు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యక్తులు, ఇలా మనసున్న ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చని కలెక్టర్ పిలుపునిచ్చారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tirumala-online-tickets-for-the-month-of-november/andhra-pradesh/531843/

AP Dairy Cooperative Breaking News in Telugu Krishna Milk Producers Krishna Milk Union Latest News in Telugu P4 Project Krishna District Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.