हिन्दी | Epaper
టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

Krishna District: భర్త వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య

Anusha
Krishna District: భర్త వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య

కృష్ణా జిల్లా (Krishna District) ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో చోటుచేసుకున్న దారుణం స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. ఆరు నెలల క్రితం పెళ్లైన ఓ యువతి తన భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. మరణానికి ముందు రాసిన సూసైడ్ లేఖలో ఆమె అనుభవించిన మానసిక, శారీరక వేదన హృదయాన్ని కదిలిస్తోంది.వివరాల్లోకి వెళ్తే.. విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్న రాంబాబు (Rambabu) కుటుంబంలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే శ్రీవిద్య (24)ని ఆరు నెలల క్రితం వివాహం చేశారు. మొదటి నెల రోజులు గడవకముందే శ్రీవిద్య జీవితం నరకం అయింది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకునే రాంబాబు, ఆమెను నిర్దయగా కొట్టి హింసించేవాడని పోలీసులు చెబుతున్నారు.

అమ్మాయి ముందు నేను పనికిరానని

శ్రీవిద్య రాసిన సూసైడ్ లేఖలో ఆమె అనుభవించిన వేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. “అరేయ్ తమ్ముడు జాగ్రత్త.. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో. నా భర్త నన్ను ప్రతిరోజూ అవమానిస్తున్నాడు. ఒక అమ్మాయి ముందు నేను పనికిరానని హేళన చేసాడు. మద్యం తాగొచ్చి నా తలను మంచానికి బలంగా కొట్టాడు, నా వీపుపై పిడిగుద్దులు గుద్ది హింసించాడు . ఇలా జీవించడం కష్టమైపోయింది. నా పరిస్థితికి కారణమైన రాంబాబును, అతని కుటుంబాన్ని వదలొద్దు” అంటూ రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆత్మహత్యకు ప్రధాన కారణాలు ఏమిటి?

మానసిక ఒత్తిడి, డిప్రెషన్, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, చదువు ఒత్తిడి, ప్రేమ వైఫల్యం, వేధింపులు, సమాజపు ఒత్తిళ్లు వంటి కారణాలు ఆత్మహత్యకు దారితీస్తాయి.

ఆత్మహత్యను నివారించడానికి ఏం చేయాలి?

మానసిక ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడడం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించడం, సానుకూల ఆలోచనలు పెంపొందించుకోవడం అవసరం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-school-students-frequent-festival-holidays/andhra-pradesh/525699/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870