📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Krishna dispute: ‘కృష్ణా’ హక్కులపై చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక

Author Icon By Tejaswini Y
Updated: November 27, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : కృష్ణా నదీ జలాల(Krishna dispute)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని సిఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుక వీలులేదని, చట్టపరంగా ఎపికి దక్కిన వాటాను యధాతథంగా కొనసాగించాల్సిందేనని సిఎం తేల్చి చెప్పారు. బుధవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్య మంత్రి…

Read Also: Ration Card : ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసిల వాటా కలిగి ఉండగా… రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా నదీ జల వివా దాల ట్రిబ్యునల్1 ఆంధ్రప్రదేశకు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు చొప్పన జలాలు కేటాయించిందన్నారు. అయితే రాష్ట్ర విభజన నేప థ్యంలో కృష్ణాజలాల కేటాయింపులను పునః సమీక్షించాలనడం సరికాదని సిఎంచెప్పారు. ప్రతీ ఏటా వేలాది టిఎంసిలజలాలు సముద్రంలో కలుస్తున్నందున వరదజలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు సిఎం సూచించారు.

Chandrababu’s clear warning on ‘Krishna’ rights

అన్ని జిల్లాలకు నీటి భద్రతే లక్ష్యం

రాష్ట్రాన్ని కరువు రహితంచేసేలా.. అన్ని జిల్లాలకు నీటి భద్రత కలిగించేలా.. సమర్ధ నీటి నిర్వహణ చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వాయర్లలో నెల కొన్న నీటి నిల్వల వివరాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ యేడాది నవంబరు 25 నాటికి రాష్ట్రంలోని మేజర్, మీడియం, మైనర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం 1,095 టీఎంసీల వరకు నీటి(Krishna dispute) నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు అన్నీ కలిపి సామర్ధంలో 83.43 శాతం మేర నిండాయని తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసినా పలు రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండక పోవడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్య యనం జరపాలని అధికారులకు సూచించారు.

గతఏడాది సగటున 7.45 మీటర్లలోతున భూగర్భజలాలు ఉండగా… ఈ ఏడాది 6.8 మీట ర్లకు పెరిగాయి. కోస్తాంధ్రలో 6.77 మీటర్ల నుంచి 6.56 మీటర్లకు, రాయలసీమ(Rayalaseema)లో 9 మీటర్ల నుంచి 7.34 మీటర్లకు భూగర్భజలమట్టాలు పెరిగినట్టు అధికా రులు సిఎంకి తెలిపారు. 8 మీటర్లకన్నా దిగువనఉన్న 5,697 గ్రామాల్లో భూగర్భజలాలు పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి అధికారులకు చెప్పారు.

మరోవైపు, పోలవరం ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 73 శాతం మేర పూర్తికాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. అలాగే బట్రస్ డ్యామ్ పనులు పూర్తిచేసినట్టు వివరించారు. డయాఫ్రమ్ వాల్ పనులు కొలిక్కి వస్తుండటంతో ప్రాజెక్టులో ప్రధాన భాగమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, ఆర్ ఆర్ ప్యాకేజ్ని నిర్వాసితులకు వేగంగా అందించాలని సిఎం సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AP CM directives AP Government Chandrababu Naidu Krishna river allocations Krishna Water Dispute Water rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.