Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు!

Read Time:  1 min
Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు
Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు
FONT SIZE
GET APP

Kranthi Kiran: క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు! తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడి పేరు వినని వారు ఉండరు ఈ ప్రఖ్యాత మసాలా ఉత్పత్తుల సంస్థపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గత కొన్ని రోజులుగా దాడులు కొనసాగిస్తోంది.గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు సంస్థ చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం దాదాపు 40 కిలోల బంగారం, 100 కిలోల వెండి.

Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు
Kranthi Kiran క్రేన్ వక్కపొడి పై నేడు ఐటీ దాడులు

రూ. 18 లక్షల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు గుంటూరులోని క్రేన్ వక్కపొడి ఫ్యాక్టరీలోనూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయని సమాచారం.ఆర్థిక లావాదేవీల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా పన్ను ఎగవేత ఉందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.ఈ దాడుల నేపథ్యంలో క్రేన్ వక్కపొడి కంపెనీ పై అనేక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.అధికారికంగా ఏం జరుగుతోంది? కంపెనీ తరపున ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించిన క్రేన్ వక్కపొడి సంస్థపై ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది.ఈ దాడులపై అధికారుల పూర్తి నివేదిక వచ్చే వరకు మరిన్ని విషయాలు వెలుగు చూడనున్నాయి.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.