Kovvuru accident news : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు రోడ్డు-కం-రైలు బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సరదాగా సినిమా చూసేందుకు బయలుదేరిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది.
వివరాల ప్రకారం, కొవ్వూరుకు చెందిన అక్షయ్ కుమార్, సునీల్, ఏడుకొండలు ముగ్గురు ఒకే బైక్‌పై రాజమండ్రి వైపు బయలుదేరారు. అదే సమయంలో లక్ష్మీనారాయణ యాక్టివాపై కొవ్వూరు వైపు వస్తుండగా, బ్రిడ్జిపై ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఢీకొట్టడం తీవ్రంగా ఉండటంతో వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి.
Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్
ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్, సునీల్, లక్ష్మీనారాయణలకు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు ఏడుకొండలకు గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: