📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

Kousthubham: తిరుమలలో వివాదాస్పద ఘటన: టీటీడీ సీరియస్

Author Icon By Saritha
Updated: December 20, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలోని ఓ విశ్రాంతిగృహంలో కోడిగుడ్లు లభించడం తీవ్ర చర్చకు దారితీసింది. (Kousthubham) ఈ ఘటనకు సంబంధించి ఓ భక్తుడు కోడిగుడ్లను తీసుకొచ్చినట్టు వార్తలు వెలుగుచూశాయి. విషయం బయటకు రావడంతో భక్తుల్లో కలకలం నెలకొంది. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీకి చెందిన శ్రీనివాస్ నాయక్ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో వ్యవహారం మరింత వైరల్ అయింది.

Read also: Pawan Kalyan: కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తా

టీటీడీ స్పందన, చర్యలు

ఈ నెల 17న తిరుమలలోని కౌస్తుభం భవనం 538వ గదిని తాను తీసుకున్నానని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. గదిని శుభ్రం చేసే సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది లోపల కోడిగుడ్లు ఉన్న కవర్‌ను బయటకు తీసినట్టు తనకు తెలిసిందన్నారు. (Kousthubham) అయితే ఆయన విడుదల చేసిన వీడియోలో కోడిగుడ్లను ప్రత్యక్షంగా చూపించలేదు. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారికంగా స్పందిస్తూ ట్వీట్ విడుదల చేసింది. నిషేధిత వస్తువులైన కోడిగుడ్లను ఓ యాత్రికుడు గదిలోకి తీసుకొచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, టీటీడీ(TTD) అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించింది. అయితే కొండపైకి నిషేధిత వస్తువులు ఎలా చేరాయన్న ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Controversy Devotee Issue Latest News in Telugu Social Media Telugu News temple news tirumala tirupati TTD YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.