పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో కొండపల్లి శ్రీనివాస్
సచివాలయం : ప్రతి కుటుంబం నుంచి ఒక్కో పారిశ్రామిక వేత్తను తయారుచేసే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని, ప్రజలను చైతన్య పరిచి, పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(Kondapalli Srinivas) పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలోని రెండవ బ్లాక్ లో ఉన్న సమావేశ మందిరంలో, పరిశ్రమల శాఖ అధికారులు, 26 జిల్లాల జెనరల్ మేనేజర్ లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆలోచనకు తగ్గట్టుగా, వారి లక్ష్యానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. ప్రతీ కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు. క్షేత్ర స్థాయిలో రీజనల్ మీటింగ్స్ పెట్టి, అవగాహన పెంచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇచ్చే విధంగా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు అనుసంధానం చేసి పరిశ్రమల ఏర్పాటు కు కావాల్సిన చేయూతను ఇచ్చి ఆలోచన నుంచి ఆచరణ వరకు పెట్టుబడి దారులకు సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Read also: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్
సాంకేతికత, నైపుణ్యాభివృద్ధిపై స్పష్టమైన అవగాహన
సాంకేతికత, నైపుణ్యాభివ్రుద్ది, ఆర్ధిక ప్రోత్సాహకాలకు సంబంధించిన విషయాలపై అధికారులు అందరికి స్పష్టమైన అవగాహన ఉండాలని, అలా ఉన్నప్పుడే, పెట్టుబడులు పెట్టాలని ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సమాచారం. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రోత్సాహం అందు తుందని మంత్రి శ్రీనివాస్(Kondapalli Srinivas) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వారానికి ఒక రోజు.. ఖచ్చితంగా సిబ్బంది అందరూ ఆఫీస్లో ఉండాల్సి ఉంటుందని, ఫీల్డ్ వర్క్ పైనే కాదు ఆఫీసుల్లో జరిగే కార్యకలాపాలన మీద దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఎవరో ఒక అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండి, ఔత్సాహికులకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు కాబోయే పరిశ్రమలపై అందరూ దృష్టి సారించాలన్నారు.
ప్రతీ వారంలో, శనివారం అధికారులు అందరూ అందుబాటులో ఉండాల్సిందేనని, రెండవ శనివారం మినహాయింపు ఉంటుందన్నారు. ఆచరణలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించేందుకు అవసరమైన మౌలిక వసతులు, మానవ వనరులను ఇచ్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకు వెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి డా. ఎన్. యువరాజ్, డైరెక్టర్ శుభమ్ బన్సాల్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొనగా, 26 జిల్లాల ఉన్నతాధికారులు వర్చువల్గా హాజరయ్యారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :