📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Blowout : కోనసీమలో చమురు కుంపటి!

Author Icon By Sudha
Updated: January 8, 2026 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పచ్చని కోనసీమను మరో బ్లోఅవుట్ భయపెడు తోంది. భూగర్భంలో దాగిన సహజవాయు పెల్లుబికినప్పుడు ఎక్కడ ఏమాత్రం లీకయినా మంటలే మంటలు. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయాల్సిందే. ఆ ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోతుంది. చమురు సహజవాయువుల సంస్థ ఆప్రాంతంలో చమురు నిక్షేపాలను వెలికి తీసిన తర్వాత ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ గ్యాస్ లీకై మంటలు వెదజల్లడం సహ జం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికి పురం మండలం ఇరుసుమండలోని మోరి 5 డ్రిలింగ్ సైటులో సోమవారం ఉదయం భీకర ధ్వనితో పేలుళ్లు వెంటవెంటనే ఎగసిన మంటలతో జనం చెల్లాచెదురయ్యారు. అగ్నిజ్వాలలు 30 మీటర్ల ఎత్తుకు చేరాయి. వాటినదు పులోకి తేవడానికి పడే కష్టం ఇంతా అంతా కాదు. పట్ట పగలు పదకొండున్నర గంటల సమయంలో ఈఉత్పాతం జరిగింది కనుక జనం జాగ్రత్త పడ్డారు కానీ లేకుంటే వారు ఆదమరచి నిద్రిస్తున్న వేళ జరిగి ఉంటే ఏమయ్యే దో ఊహించుకుంటేనే భయమేస్తోంది. కోనసీమ గర్భాన చమురు సహజవాయువులు కొన్ని తరాల వరకు సరిపడే సహజసంపద ఉంది. దీనికోసం కన్నేయని అంతర్జాతీయ సంస్థలు లేవంటే నమ్మాలి. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా అమాంతం కోనసీమను కబళించాలని చూసాయి. అక్కడ భూగర్భంలో నిక్షిప్తమైన సహజ వనరుల కోసమే. గతంలో ఇదే ప్రాంతంలోని కొమరాడ బావి నుంచి బ్లో అవుట్లు జరిగినప్పుడల్లా కోనసీమ ప్రాంత ప్రజానీకం నిద్రలేని రాత్రులు గడిపేది. 1993లో ఆ తర్వాత 1995లో పాశర్లపూడి 19ఎ బావిలో డ్రిల్లింగ్ చేస్తుండగా బ్లో అవుట్ (Blowout) సంభవించింది. మూడోసారి జరిగిన బ్లో అవుట్ పర్యవసానం ప్రాణాలను బలితీసుకొంది. పాశర్లపూడి బ్లోఅవుట్లో 65 రోజుల పాటు దేశ విదేశాల్లోని నైపుణ్య సంస్థలన్నీ అక్కడే ఉండి బ్లో అవుట్ను (Blowout) లొంగ దీసుకునేందుకు విశ్వప్రయత్నం చేశాయి. ఎప్పటికో కానీ లొంగిరాలేదు. ఆ తర్వాత 2014లో మామిడి కుదురు మండలం ‘నగరం’ గ్రామంలో గెయిల్ కంపెనీపైపు పగిలింది. గ్యాస్ లీకైంది. 22 మంది కాలిబుగ్గిపాలయ్యారు. తరచు జరిగే బ్లో అవుట్లకు కోనసీమ అలవాటు పడిపోయింది. అయినా చమురు సహజవాయువుల సంస్థ గుణపాఠాలు నేర్వలేదు. బ్లోఅవుట్లు వల్ల జరిగే ఆర్థిక నష్టం ఎంతో చెప్పనలవికాదు. ప్రస్తుతం జరిగిన బ్లో అవుట్ వలన నష్టపోయిన మొత్తం వందల కోట్లలోనే ఉంటుంది. అగ్నికీలలకు ఎన్నో కొబ్బరిచెట్లు మాడి మసై పోయాయి. ఒక్కసారిగా బయటికొచ్చిన మంటలు కార్చిచ్చు లా వ్యాపించడం వల్ల ఇరుసుమండ, లక్కవరం గ్రామ స్తులు తీవ్ర భయభ్రాంతులైనారు. కొన్ని రిగ్లు, లాగింగ్ టూల్స్, భారీ వాహనాలు కాలిపోయాయి. పరిసరాల్లోని పంటలు, ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లింది. గ్యాస్ బావి నుంచి ఉధృతంగా బయటికొచ్చిన మంటలు అర్థరాత్రి కూడా కొనసాగాయి. వీటన్నిటిని అదుపు చేసేం దుకు స్థానిక సాంకేతికత ఏమాత్రం సరిపోదు. ఒకప్పుడు ‘బాంబే హై’గా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో బ్లో అవుట్ లు జరగకుండా సన్నద్ధమయ్యే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేక పోయింది. బ్లో అవుట్ జరిగిన ప్రాంతంలో అరకిలోమీట రు వరకు ’50’డిగ్రీల ఉష్ణోగ్రత వ్యాపించి ఉంది. ఈ సందర్భంగా విద్యుత్వర్లు మాడిపోయి విద్యుత్ ఘాతాల వంటి ప్రమాదాలు జరుగకుండా కరెంటు ఆపారు. బావి లో గ్యాస్ పీడనస్థాయి తగ్గి, మంటలు అదుపులోకి వచ్చే వరకు నియంత్రణ చర్యలు జరుగుతూనే ఉంటాయి. ఆపై బావుల శుద్ధి పునరుద్ధరణ వంటి పనులు పూర్తయ్యేసరికి కనీసం వారం రోజులు పట్టే అవకాశముంది. 1993లో గ్యాస్ నిల్వలు ఏ మేరకు నిక్షిప్తమయ్యాయో తెలుసుకు నేందుకు మోరి 5 వెల్ని తవ్వారు. 2024లోనే ఈ బావిని డీప్ ఇండస్ట్రీస్కుసబ్జ్కు ఇచ్చారు. ఘటన జరిగిన రోజున ఇదే బావిలో 2500మీటర్ల లోతులో ఒక లేయర్లో ఎక్స్ ప్లరేషన్ (వర్క్ ఓవర్ రిగ్)కు ప్రయత్నిం చారు. దాంతో బావిలో పీడనం పెరిగిపోయింది. ఆ సమయం లోనే పీడనం ఎక్కువై క్రూడాయిల్తో కలిసి ఒక్కసారిగా గ్యాస్ ఎగజిమ్మింది. బ్లో అవుట్లో కనీసం 500,౬౦౦ కొబ్బరిచెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రస్తుతం మంటల విస్తరణ ఆగింది. డ్రిలింగ్ నిలిపి వేశారు. ప్రస్తుతం ఈ బావిలో 20వేల నుంచి 40వేల క్యూబిక్ వరకు
గ్యాస్ ఉందని అంచనా వేస్తున్నారు. ఏ మేరకు మండిపోయిం దో తెలిస్తే తప్ప నష్టాన్ని అంచనా వేయలేరు. 1995లో జరిగిన మామిడి కుదురు మండలం పాశర్లపూడిలో అతి పెద్ద బ్లోఅవుట్ జరిగింది. దేశచరిత్ర లో ఇదే పెద్ద బ్లో అవుట్. ఎలా అదుపు చేయాలో తెలియక నిపుణులు సైతం తలలుపట్టుకుకూర్చున్నారు. ఎన్నో కోట్ల వ్యయమయ్యింది కూడా. నాలుగైదు దశా బ్దాల క్రితం కోనసీమ అంతర్భాగంలో బావులున్నాయని తెలుసుకోగానే ఆ ప్రాంతం విశ్వవ్యాప్త ఖ్యాతి పొందింది. అప్పట్లో ఎన్నో బావులు తవ్వినా నిరుపయోగంగా ఉన్న వాటిని తర్వాత తర్వాత వినియోగంలో లేని బావులను మూసి వేయలేదు. అవి కూడా ప్రమాదమేనని భావించినా అలాంటి రక్షణ చర్యలేవీ ఓఎని జిసి చేపట్టలేదు. ఆనాటి పైపైన్లే ఇప్పటికీ వినియోగిస్తున్న సందర్భాల్లో వాటిని ఏ సందర్భంలోనూ క్లీన్ చేయలేదు. అలా కాల దోషం పట్టిన బావుల్లోంచి లీకయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఖర్చుకు భయపడి వాటి మరమ్మతులు చేయిం చలేదు. వాటి తాలూకు ఆ లీకులే ఇప్పుడు ఎన్నో కోట్ల నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ముందు జాగ్రత్తగా పురాతన పైన్లను మారిస్తేకోనసీమ కార్చిచ్చు దావానంలా వ్యాపించి ఉండేది కాదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Blowout Breaking News Gas Leak Industrial Accident konaseema latest news Oil Well Fire Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.