📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Konaseema Gas Leak: ఐదో రోజునా ఆరని మంటలు

Author Icon By Saritha
Updated: January 10, 2026 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోనసీమ ఓఎన్జీసీ గ్యాస్ పై సిఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

రాజోలు : కోనసీమ ఓఎన్జీసీ బావి వద్ద ఐదో రోజు మంటలు ఘటనాస్థలిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా, ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద ఐదో రోజు కూడా (Konaseema Gas Leak) మంటలు కొనసాగుతుండటంతో ముఖ్య మంత్రి చంద్రబాబు(CM Chandrababu) శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గ్యాస్ బావి నుంచి ఎగిసిపడుతున్న మంటలను, పరిసర ప్రాంతాల్లోని పరిస్థితిని ఆయన గగనతలం నుంచి పరిశీలించారు. అనంతరం మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో ఆయన ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎంపీ హరీశ్ బాలయోగి, ఎమ్మెల్యే వరప్రసాద్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సీఎం ఆరా తీశారు.

Read also: Telangana: BRS హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

Konaseema Gas Leak The fire continues for the fifth day.

దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం ఆదేశం

మంటల వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (Konaseema Gas Leak) మరోవైపు, బ్లోఅవుట్ను అదుపులోకి తెచ్చేందుకు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ముమ్మరంగా పనిచేస్తున్నామని ఓఎన్జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షోభ నిర్వహణ బృందం ఇప్పటికే బావి పరిసరాల్లోని శిథిలాలను చాలావరకు తొలగించి, బావి హెడ్ వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. బావిని క్యాపింగ్ చేసే దిశగా ఆపరేషన్ కొనసాగించేందుకు అడ్డంకిగా ఉన్న మాస్ట్, ఇతర పరికరాల భాగాలను తొలగించినట్లు పేర్కొంది.

బావి హెడ్ సమీపంలో సురక్షితంగా పనిచేసేందుకు వీలుగా నిరంతరం నీటిని చల్లుతున్నామని వివరించింది. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం మరమ్మతు పనులు చేస్తుండగా ఈ బావి నుంచి అకస్మాత్తుగా ముడిచమురుతో కూడిన గ్యాస్ భారీగా ఎగిసిపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరుసుమండ, పరిసర గ్రామాల్లో దట్టమైన పొగ, గ్యాస్ వ్యాపించి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.


Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Aerial Survey Blowout Control Chandrababu Naidu fire accident Gas Leak konaseema Latest News in Telugu ONGC Gas Well Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.