📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Konaseema: గోదావరిలో గల్లంతైన ఎనిమిది మంది యువకులు

Author Icon By Shobha Rani
Updated: May 27, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ (Konaseema) జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల ఫంక్షన్ సంతోషం… క్షణాల్లో విషాదం మిగిలింది. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముమ్మడివరం దగ్గర గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. మూడు మృతదేహాలు లభ్యం.. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి నుంచి SDRF, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న ముమ్మిడివరం దగ్గర ఫంక్షన్‌కి వచ్చిన స్నేహితులు.. భోజనాల తర్వాత గోదారిగట్టుకు వెళ్లారు. నీళ్లలోకి దిగి ఆడుతుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టుతప్పి ఒక యువకుడు మునిగిపోతుండడంతో.. అతన్ని కాపాడే ప్రయత్నంలో మరో ఏడుగురు గల్లంతయ్యారు.

Konaseema: గోదావరిలో గల్లంతైన ఎనిమిది మంది యువకులు

ఘటన స్థల వివరాలు
వివరాల ప్రకారం.. కాకినాడ, మండపేట, రామచంద్రపురం నుంచి 11 మంది స్నేహితులు.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని శేరిలంకలో శుభకార్యానికి వచ్చారు. హాఫ్ శారీ పంక్షన్ అయిపోయిన అనంతరం సాయంత్రం వేళ అందరూ సరదాగా గోదావరి దగ్గరకు వెళ్లారు.. అనంతరం స్నానాలకు దిగి ఈత కొడుతుండటం ఒక యువకుడు మునిగిపోయాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో 8మంది గల్లంతయ్యారు. అయితే.. ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణకుమార్‌, మేడిశెట్టి చరణ్‌ రోహిత్‌, కనికెళ్ల సురేష్‌ సురక్షితంగా బయటపడ్డారు. సాన్నానికి వెళ్లిన 11 మందిలో ఎనిమిది మంది గల్లంతవ్వడం కలకలం రేపింది.. ఈ విషయం తెలుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబిత క్రాంతి ఇమాన్యేలు (19), సబిత పాల్‌ (18), తాటిపూడి నితీష్‌ (18), ఎలుమర్తి సాయి (18), మండపేటకు చెందిన రోహిత్‌ (18), శేరిలంక ప్రాంతానికి చెందిన ఎలిపే మహేష్‌ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన అన్నదమ్ములు వడ్డే మహేష్‌ (16), వడ్డే రాజేష్‌ (14) గల్లంతయ్యారు.
ప్రభుత్వ స్పందన
వీళ్లకి ఈ ప్రాంతంలో నది ఎంత లోతు ఉంటుంది అనేది అంచనా తెలియలేదు. ముందు ఒక యువకుడు పట్టుతప్పి కొట్టుకుపోతుండడంతో అతని కాపాడే క్రమంలో మిగతా వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ మహేష్‌ కుమార్‌, ఎస్పీ కృష్ణారావు (Krishnarao)స్వయంగా రెస్క్యూ ఆపరేషన్‌ని పర్యవేక్షించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(Chandrababunaidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan kalyan) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ ఘటన ప్రజలకు ఒక హెచ్చరికగా మారింది. పెద్దనదుల వద్ద నీటి లోతు గురించి తెలియకపోతే, సరదాగా ఈతలు ప్రమాదకరమవుతాయని ఇది మళ్లీ నిరూపించింది. ప్రభుత్వం, పోలీస్ శాఖలు ఇకపై సురక్షిత ఈత నియమావళి పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది.

Read Also: Nara Lokesh: టీడీపీ వర్కింగ్ అధ్యక్షునిగా నారా లోకేశ్?

Breaking News in Telugu Drowning Incident Google news Google News in Telugu konaseema Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.