📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Konaseema Accident: అదుపులోకి బ్లోఅవుట్.. రంగంలోకి ఓఎన్ జిసి బృందం

Author Icon By Rajitha
Updated: January 8, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజోలు : మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్టిసి మోరి 5 బోరుబావి నుండి గ్యాస్ లీకేజీ మంటలు అదుపులోకి వస్తోండగా ప్రజారక్షణ పై ఓఎన్జీసీ నిరక్ష ప్రజల్లో ఆగ్రహవేశాలు పెలుబుకుతోన్న పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ కోన సీమ జిల్లాలో నెలకొంది. బ్లోఔట్ ప్రాంతానికి రోడ్డు అవసరమని ఓ స్టైన్ నిపుణుల బృందం కోరడంతో తక్షణమే స్పందించిన అమలాపురం ఎంపీ హరేష్ బాలయోగి రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. దీంతో ప్రమాద స్థలంలోని శరదాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇరుసుమండలో గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పందించారు. ఈ నెల 9వ కోనసీమ బ్లో ఔట్ ప్రాంతాన్ని సందర్శించి… ఏరియల్ సర్వే చేయనున్నట్టు తెలిసింది.

Read also: Weather: బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

The blowout has been brought under control

నేటి సాయంత్రానికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయని

ఓఎన్జీసి మోరి 5 బోరుబావి నుండ గ్యాస్ లీకేజీ మంటలు అదుపులోకి వచ్చాయని త్వరలో క్యాపింగ్ పనులు పూర్తవుతాయని ఇరుసుమండ గుబ్బల వారి పాలెం, చింతల వల్లి లక్క వరం గ్రామ ప్రజానీకానికి పూర్తిగా ముప్పు బెడడ తప్పిందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ రాజోలు శాసనసభ్యులు దేవవరప్రసాద్, ఓఎన్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు విక్రమ్ నక్సేనా, శాంత నూరు దాస్ లు సమావేశం నిర్వహించి గ్యాస్ లీకేజ్ సంఘటన ప్రస్తుత స్థితిగతులపై వివరించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం నుండి ప్రత్యేక రిగ్గుడు స్థానికంగా తీసుకుని వచ్చి నియంత్రణ చర్యలు 5 పంపులతో వాటర్ అంబ్రెల్లాగా ఏర్పరచి ముందుగా వేడి తీవ్రతను అరికట్టడం జరిగిందని, నేటి సాయంత్రానికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయని త్వరలో బోరు బావికి క్యాపింగ్ పనులు చేపడతారని ఆయన వెల్లడించారు.

వృద్ధులు, గర్భిణీ స్త్రీల పరిస్థితి

10 మీటర్ల వ్యాసార్థం లో బృందాల నియంత్రణ చర్యలు కొనసా గుతున్నాయన్నారు. బ్లో అవుట్ మూలంగా ఏర్పడిన ఆస్తి నష్టాలపై అంచనాలు గణన ప్రారంభమైందని, అదేవిధంగా నాలుగు గ్రామాల ప్రజలకు సహాయం అందించేందుకు గణాంకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ప్రసంగిస్తూ గ్యాస్ లీక్ అయిన ఇరుసుమండ ప్రక్క మూడు గ్రామాల ప్రజలు భీతావాహులై భయాందోళనలకు గురికాబడ్డారని, వీరిలో 102 సంవత్సరాల వయసున్న వృద్ధులను గర్భిణీ స్త్రీలను, కాలు విరిగి సిమెంట్ కట్టలతో జీవిస్తున్న వారు హుటా హుటీనా ప్రాణ భయంతో అర్థగంట పక్క గ్రామాలకు భద్రతా పరంగా చేరుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఇరుసమండ బ్లో అవుట్ ప్రాంతం వద్ద బుధవారం సాయంత్రం స్థానిక ప్రజలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

గో బ్యాక్ ఓయిన్జీసీ, గో బ్యాక్ ఓయిన్జీసీ అంటూ నినాదాలు స్థానిక మహిళలు, పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలుత ఇరుసుమండ గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తులు సమావేశం అయ్యారు . ఓయిన్జీసీ వాళ్లు ఇచ్చే నష్ట పరిహారంపై చర్చించుకున్న గ్రామస్తులు, పరిహారం కంటే ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఓఎన్జీసి తరలి వెళ్లిపోయేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. అనంతరం మహిళలు, స్థానికులు ప్రజలు బ్లో అవుట్ ప్రాంతానికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ ప్రమాదం జరిగిన సమయంలో తీవ్ర ఆందోళన చెందామని, ప్రాణ భయంతో అన్ని వదులుకొని పరుగులు తీశామని తెలిపొరు. వెంటనే ఇక్కడ ఓయిన్జీసీ కార్యకలాపాలు మానేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఓయిన్జీసీ కార్యకలాపాలు వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Gas Leak Irusumanda konaseema latest news ONGC Rajolu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.