Komati Jayaram: ప్రవాస భారతీయుడు కోమటి జయరాం నార్త్ అమెరికా స్పెషల్ రిప్రజెంటేటివ్ గా నియమితులయ్యారు. ఈక్రమంలో ఈరోజు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి
ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైల సమక్షంలో, వేద ఆశీర్వచనాల నడుమ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
Read Also: Sukhoi su30 mki : అస్సాం పరిసరాల్లో యుద్ధ విమానం అదృశ్యం, కొనసాగుతున్న గాలింపు
ఈ కార్యక్రమలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమలో ఎన్నారై శాఖా మాత్యులు కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు వేమూరి రవి, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ రవి మండలపు, ప్రముఖ ఎన్నారై డాక్టర్ రాజా పిల్లి సహా తదితర ఎన్నారైలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఇదే సమయంలో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్ధులు, అక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు ఏవైనా సమస్యలు వారి పరిష్కారాలకు కృషి చేయడమే కాకుండా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో, తన వంతు కృషి చేయడంలో సమర్ధవంతంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: